iDreamPost

సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా కివీస్ లెజెండ్! కావ్య పాప మాస్టర్ ప్లాన్..

  • Author Soma Sekhar Published - 03:25 PM, Mon - 7 August 23
  • Author Soma Sekhar Published - 03:25 PM, Mon - 7 August 23
సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా కివీస్ లెజెండ్! కావ్య పాప మాస్టర్ ప్లాన్..

ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమ జట్టులోని ఆటగాళ్లను, స్టాఫ్ సభ్యులను మార్చుతూ వస్తున్నాయి. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నాయి అన్ని ఐపీఎల్ టీమ్స్. అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే సన్ రైజర్స్ హెడ్ కోచ్ అయిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను హెడ్ కోచ్ గా తొలగించింది. ఇప్పుడు అతడి స్థానంలో న్యూజిలాండ్ లెజెండరీ ఆటగాడిని హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది సన్ రైజర్స్ యాజమాన్యం. దీంతో రాబోయే సీజన్ కోసం కావ్య పాప మాస్టర్ ప్లానే వేసింది అంటున్నారు విశ్లేషకులు.

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. చివరిగా 2016లో ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది సన్ రైజర్స్. ఆ తర్వాత ఎంత మంది ఆటగాళ్లు మారినా, కెప్టెన్స్ మారినా.. కోచ్ లు మారినా వారు మాత్రం కప్ కోట్టలేకపోయారు. దాంతో జట్టును ప్రక్షళన చేయాలని భావించింది యాజమ్యానం. అందులో భాగంగానే గత సీజన్ లో కొంత మంది ఆటగాళ్లను వదులుకుంది. మరికొంత మందిని వేలంలో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించింది సన్ రైజర్స్. లారా స్థానంలో న్యూజిలాండ్ లెజెండరీ స్పిన్నర్ డానియల్ వెట్టోరిని తమ హెడ్ కోచ్ గా నియమించుకుంది సన్ రైజర్స్ టీమ్.

ఈ విషయాన్ని తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియపరిచింది సన్ రైజర్స్ యాజమాన్యం. దీంతో రాబోయే సీజన్ కోసం కావ్య పాప ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోందని కితాబిస్తున్నారు క్రీడా పండితులు. ఇక న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే కాక వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్టార్ ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. డానియల్ వెట్టోరి. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 113 టెస్టులు ఆడి 4531 పరుగులు చేశాడు. ఇక 295 వన్డేల్లో 2253 పరుగులు, 34 టీ20ల్లో 205 పరుగులు చేశాడు. 34 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడాడు వెట్టోరీ. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించాడు. మరి వెట్టోరీ ఏ మేరకు సన్ రైజర్స్ ను నడిపిస్తాడో వేచి చూడాలి.

ఇదికూడా చదవండి: అందరూ పాండ్యాను తిడుతున్నారు! కానీ.. అతనో గొప్ప రికార్డు సాధించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి