Nidhan
Fan Reaction To Babar Azam Dismissal Goes Viral: వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ అంటూ బాబర్ ఆజం గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు తెగ బిల్డప్ ఇస్తుంటారు. కానీ అతడు మాత్రం తన ఆటతీరుతో పరువు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. మరోసారి అలాంటి ఘటనే జరిగింది.
Fan Reaction To Babar Azam Dismissal Goes Viral: వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ అంటూ బాబర్ ఆజం గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు తెగ బిల్డప్ ఇస్తుంటారు. కానీ అతడు మాత్రం తన ఆటతీరుతో పరువు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. మరోసారి అలాంటి ఘటనే జరిగింది.
Nidhan
ప్రస్తుత క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే ఠక్కున విరాట్ కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. సెంచరీలు, పరుగులు, రికార్డులు ఇలా ఏ విధంగా చూసుకున్నా విరాట్ కు సాటి ఈ జనరేషన్ లో ఎవరూ లేరు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు మాత్రం బాబర్ ఆజమే తోపు అంటూ అనవసర బిల్డప్ ఇస్తుంటారు. బాబర్ ముందు కోహ్లీ కూడా పనికిరాడంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. బాబర్ ను కొట్టేటోడే లేడని.. అతడు మోడ్రన్ మాస్టర్ అంటూ ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ చిన్న జట్లపై విరుచుకుపడే బాబర్.. పెద్ద టీమ్స్ మీద తుస్సుమంటాడు. పాక్ అభిమానులు ఇచ్చే బిల్డప్ కు బాబర్ గేమ్ కు ఎక్కడా పొంతనే ఉండదు. ఇటీవల కాలంలో అతడి ఆటతీరు మరింత దిగజారింది. తనను ఆకాశానికెత్తేసే ఫ్యాన్స్ కూడా విమర్శించేలా తీసికట్టుగా తయారైంది.
వరుసగా ఫెయిల్ అవుతున్న బాబర్ ఆజం.. మరోసారి ఇజ్జత్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో అతడు డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న రెండో బతికే క్యాచ్ ఔటై పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో బంగ్లా బౌలర్లను చితగ్గొడతాడు, పరుగుల వరద పారిస్తాడని ఆశించిన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఓ వీరాభిమాని అయితే ఫ్ట్రస్టేషన్ తో ఇలాగేనా ఆడేది అంటూ బాబర్ వైపు పళ్లు నూరుతూ చూశాడు. పక్కనే ఉన్న ఇంకో ఫ్యాన్ కూడా ఇదేం గేమ్ రా బాబు అంటూ నిరాశగా చూశాడు. ఈ రియాక్షన్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. ఒరే ఆజామూ ఆడటం మానెయ్, నీ వల్ల కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ బౌలర్లను బాదలేకపోతున్నావ్.. నువ్వు నంబర్ వన్ బ్యాటర్ ఏంటంటూ బాబర్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకంటే కోల్పోవడానికి ఏమీ లేదు, ఉన్న కాస్త పరువు కూడా పోయిందిగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా మేలుకొని బ్యాటింగ్ టెక్నిక్ ను మార్చుకో అని సూచిస్తున్నారు. ఇక, బంగ్లాతో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్.. 448/6 స్కోరుకు డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171 నాటౌట్), సౌద్ షకీల్ (141) భారీ సెంచరీలతో విరుచుకుపడ్డారు. షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మూద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ప్రస్తుతం 3 వికెట్లకు 159 పరుగులతో ఉంది. షద్మన్ ఇస్లాం (64 నాటౌట్), ముష్ఫికర్ రహీం (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.