SNP
SNP
మరో నాలుగు రోజుల్లో పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2023 జరగనుంది. ఈ మెగా మినీ వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుందగా.. భారత్, పాకిస్థాన్ హాట్ ఫేవరేట్లుగా ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ అండర్‌డాగ్స్‌గా రంగంలోకి దూకుతున్నాయి. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రతిష్టాత్మకంగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ.. ఆసియా కప్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్‌గా పటిష్టమైన జట్టును ప్రకటించింది. కాగా, ఆసియా కప్‌లో టీమిండియా విజయావకాశాలపై భారత మాజీ సెలెక్టర్ మదన్ లాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆసియా కప్ 2023లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. కానీ, వన్డే వరల్డ్ కప్ విజేతను అంచనా వేయడం కష్టంగా మారిందని, టీమిండియా ఫేవరేట్‌గా ఉన్నా.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా కూడా వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందని మదన్ లాల్ పేర్కొన్నారు. వరల్డ్ కప్ ఇండియాలోనే జరగడం సానుకూల అంశమే అయినా.. స్వదేశంలో ఆడటంతో భారీ అంచనాలతో ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని అన్నారు. కానీ, టీమిండియాలో ఎక్కువ మంది ఆటగాళ్లు చాలా అనుభవజ్ఞులు కావాడంతో అది పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు.
అయితే.. టీమిండియాలోకి శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ రావడంతో భారత మిడిల్డార్ బలంగా మారిందని, కానీ, వారు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వస్తున్నారని, మరి గాయాల తర్వాత వారి ఆట ఎలా ఉంటుందో చెప్పడం కష్టమన్నారు. వారిద్దరూ బాగా ఆడితేనే టీమిండియా మిడిల్డార్ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మదన్ లాల్ విశ్లేషణ ప్రకారం ఆసియా కప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా ఉంటే.. వరల్డ్ కప్‌లో మాత్రం తీవ్ర పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. మూడో సారి భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలంటే.. కచ్చితం స్థాయికి మించి ఆడాలని పేర్కొన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer in the batting practice session ahead of Asia Cup 2023.
Shreyas Iyer is ready for Asia Cup! pic.twitter.com/2isXJLZctO
— CricketMAN2 (@ImTanujSingh) August 25, 2023
ఇదీ చదవండి: కోహ్లీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ! ఏం తప్పు చేశాడంటే?