iDreamPost

కోహ్లీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చిన బీసీసీఐ! ఏం తప్పు చేశాడంటే?

  • Published Aug 25, 2023 | 12:47 PMUpdated Aug 25, 2023 | 12:47 PM
  • Published Aug 25, 2023 | 12:47 PMUpdated Aug 25, 2023 | 12:47 PM
కోహ్లీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చిన బీసీసీఐ! ఏం తప్పు చేశాడంటే?

కీలకమైన ఆసియా కప్‌ 2023కి భారత క్రికెట్‌లో పెద్ద గందరగోళం నెలకొంది. టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌, జట్టుకు బ్యాక్‌బోన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. కోహ్లీ లాంటి ఆటగాడికి బీసీసీఐ వార్నింగ్‌ ఇవ్వడంపై ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కోహ్లీతో పాటు భారత జట్టు మొత్తానికి బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చినట్లు విశ్వనీయ సమాచారం. అయితే.. బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చేంత పెద్ద తప్పు కోహ్లీ ఏం చేశాడంటే.. ఆసియా కప్‌కి ముందు ఆటగాళ్లకు యోయో టెస్ట్‌ పెట్టాలని భారత క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది.

ఈ యోయో టెస్ట్‌కు తొలుత కోహ్లీనే ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో అందరికంటే ఎక్కువగా ఫిట్‌గా ఉన్న ఆటగాడు ఎవడంటే.. కోహ్లీ పేరే వినిపిస్తుంది. తన కెరీర్‌ ఆరంభం నుంచి ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టిన కోహ్లీ.. జట్టు మొత్తానికి ఫిట్‌నెస్‌లో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయినా కూడా నిబంధనల ప్రకారం కోహ్లీ యోయో టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఏకంగా 17.2 పాయింట్లు సాధించి యోయో టెస్ట్‌లో పాసైనట్లు కోహ్లీనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టాడు. చిరుతకు వేట, చేపకు ఈత పోటీ పెట్టినట్లు.. కోహ్లీకి యోయో టెస్ట్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కోహ్లీ తన యోయో టెస్ట్‌ పాయింట్లను సోషల్‌ మీడియాలో పెట్టడంపై బీసీసీఐ సీరియస్‌ అయింది. యోయో టెస్ట్‌ ఫలితం రహస్యంగా ఉంచాలని, ఇలా సోషల్‌ మీడియాలో పెట్టొద్దని, కోహ్లీ ఒక్కడికే కాకుండా జట్టు మొత్తానికి సూత్రప్రాయంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై ఎవరూ కూడా యోయో టెస్ట్‌లో ఎన్ని పాయింట్లు వచ్చాయో సోషల్‌ మీడియాలో వెల్లడించడానికి వీల్లేదంటూ తేల్చిచెప్పింది. కాగా, కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సైతం యోయో టెస్ట్‌లో పాస్‌ అయ్యారు. కానీ, వాళ్లకు ఎన్ని పాయింట్ల వచ్చాయో గోప్య​ంగా ఉంచారు. అయితే.. యోయో టెస్ట్‌లో ఎన్ని పాయింట్లు వచ్చాయో వెల్లడించడంలో ఇబ్బంది ఏంటో తెలియడం లేదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నసీమ్‌ షా ఓవర్‌ యాక్షన్‌! పాకిస్థాన్‌పై దారుణమైన ట్రోలింగ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి