iDreamPost
android-app
ios-app

స్టేజ్ పైకి బుమ్రా క్రేజీ ఎంట్రీ.. వీడియో చూస్తే మ్యాడ్ అయిపోతారు!

  • Published Aug 27, 2024 | 9:44 PM Updated Updated Aug 27, 2024 | 9:44 PM

Jasprit Bumrah Grand Entry- SathyaBama University Chennai: టీమిండియా స్టార్ పేసర్ జాస్ప్రిత్ బుమ్రాకి చెందిన ఒక గ్రాండ్ ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డేకి వెళ్లిన బుమ్రా తన స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

Jasprit Bumrah Grand Entry- SathyaBama University Chennai: టీమిండియా స్టార్ పేసర్ జాస్ప్రిత్ బుమ్రాకి చెందిన ఒక గ్రాండ్ ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డేకి వెళ్లిన బుమ్రా తన స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

  • Published Aug 27, 2024 | 9:44 PMUpdated Aug 27, 2024 | 9:44 PM
స్టేజ్ పైకి బుమ్రా క్రేజీ ఎంట్రీ.. వీడియో చూస్తే మ్యాడ్ అయిపోతారు!

జాస్ప్రిత్ బుమ్రా.. టీమిండియాకి వరల్డ్ కప్ దక్కింది అంటే.. అందులో బుమ్రా పాత్ర చాలా కీలకం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వరల్డ్ క్రికెట్ లో ఉన్న స్టార్ బ్యాటర్లు బుమ్రా విలన్ అయితే.. టీమిండియా క్రికెట్ అభిమానులకు బుమ్రా ఒక సూపర్ హీరోతే సమానం. సాధారణంగానే బుమ్రా ఎక్కడికి వెళ్లినా స్పెషల్ అటెన్షన్, సూపర్ స్పెషల్ రిసీవింగ్, వెలకమ్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ తెచ్చిన తర్వాత అది మరింత పెరిగింది. ఇప్పుడు జాస్ప్రిత్ బుమ్రా ఇచ్చిన ఎంట్రీ చూస్తే.. సౌత్, నార్త్, ఏ సూపర్ స్టార్ కూడా సరిపోడు. ఆ రేంజ్ లో బుమ్రాకి ఎంట్రీ ప్లాన్ చేశారు. ఆ వీడియో చూస్తే మీరు కచ్చితంగా మ్యాడ్ అయిపోతారు.

ప్రస్తుతం జాస్త్రిత్ బుమ్రాకి సంబంధించి వీడియో ఒకటి నెట్టిట తెగ వైరల్ అవుతోంది. అది అలాంటి ఇలాంటి వీడియో కాదు.. సూపర్ హీరో స్టైల్లో స్టేజ్ మీదకు జాస్ప్రిత్ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది. అక్కడ ఉన్న సత్యభామ యూనివర్సిటీ ఫ్రెషర్స్ డే జరుపుకుంటోంది. అందుకోసం పెద్దఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుమ్రాని ఆహ్వానించారు. ఇన్ వైట్ చేయడం వరకు ఓకే.. ఆ తర్వాత వాళ్లు చేసిన ఏర్పాట్లు చూస్తే నెటిజన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బుమ్రా ఎంట్రీకి అంతా మ్యాడ్ అయిపోతున్నారు. ఒక కుర్చీలో కూర్చోబెట్టి.. స్లో మోషన్ లో స్టేజ్ వైపు తిప్పారు. ఆ తర్వాత బుమ్రా ర్యాంప్ మీద నడుచుకుంటూ వస్తుంటే.. ఆ స్వాగ్ కి అక్కడున్న విద్యార్థులే కాదు నెటిజన్స్ కూడా పిచ్చెక్కిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AravindTheTraveller (@just_try_it_babai)

అలాగే ఈ కార్యక్రమంలో ఇంకా చాలానే ఆకర్షణలు ఉన్నాయి. ఫైర్ వర్క్స్, మ్యూజిక్ కాన్సర్ట్ ని కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి జాస్ప్రిత్ బుమ్రాతో పాటుగా.. ప్రముఖ యూట్యాబ్ సెన్సేషన్, మ్యూజీషియన్- మ్యూజిక్ కంపోజర్- సింగర్ సాయి అభ్యాంకర్ ని కూడా ఆహ్వానించారు. అతను లైవ్ కాన్సర్ట్ కూడా నిర్వహించాడు. సాయి అభ్యాంకర్ ఎవరో కాదు.. మీరు సోషల్ మీడియా రీల్స్ లో వింటున్న ‘ఆశా కూడా (Aasa Kooda)’ కంపోజ్ చేసి సాయి అభ్యాంకర్ నిర్మించాడు. ఇలా ప్రస్తుతం సత్యభామ యూనివర్సిటీ ఫ్రెషర్స్ డేకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. జాస్ప్రిత్ బుమ్రా సూపర్ హీరో ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Abhyankkar (@abhyankkar)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş