iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: ఇంగ్లాండ్ లో Jr. బుమ్రా.. అచ్చం దింపేశాడుగా! వీడియో వైరల్

  • Published Feb 07, 2024 | 3:13 PM Updated Updated Feb 07, 2024 | 3:13 PM

ఇంగ్లాండ్ యంగ్ క్రికెట్ టీమ్ లో ఓ జూనియర్ బుమ్రా వెలుగులోకి వచ్చాడు. అచ్చుగుద్దినట్లుగా అతడిలానే బౌలింగ్ చేస్తూ.. అందరిని షాక్ కు గురిచేస్తున్నాడు.

ఇంగ్లాండ్ యంగ్ క్రికెట్ టీమ్ లో ఓ జూనియర్ బుమ్రా వెలుగులోకి వచ్చాడు. అచ్చుగుద్దినట్లుగా అతడిలానే బౌలింగ్ చేస్తూ.. అందరిని షాక్ కు గురిచేస్తున్నాడు.

Jasprit Bumrah: ఇంగ్లాండ్ లో Jr. బుమ్రా.. అచ్చం దింపేశాడుగా! వీడియో వైరల్

జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో 9 వికెట్లతో చెలరేగాడు. దీంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డెడ్లీ యార్కర్ తో ఇంగ్లీష్ బ్యాటర్ ఓలీ పోప్ ను బోల్తా కొట్టించి.. ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ స్పీడ్ బౌలర్. ఇక ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఇంగ్లాండ్ యంగ్ క్రికెట్ టీమ్ లో ఓ జూనియర్ బుమ్రా వెలుగులోకి వచ్చాడు. అచ్చుగుద్దినట్లుగా అతడిలానే బౌలింగ్ చేస్తూ.. అందరిని షాక్ కు గురిచేస్తున్నాడు.

క్రికెట్ లో సహచర ఆటగాళ్లను కొందరు ప్లేయర్లు ఇమిటేషన్ చేస్తూ ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా రకరకాలుగా సదరు ఆటగాడి హావభావాలను ప్రదర్శిస్తూ కడుపుబ్బా నవ్విస్తారు. ఇక మరికొందరు తమ ఆరాధ్య క్రికెటర్ లాగే తాము కూడా ఉండాలని భావించి.. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ యువ ఇంగ్లాండ్ క్రికెటర్ అచ్చం బుమ్రా స్టైల్లోనే బౌలింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. ఓ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ కు చెందిన కొందరు యంగ్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అందులో ఓ కుర్రాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్ చేశాడు. కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా యువ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఆ వీడియోను సదరు నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. ఇంగ్లాండ్ లో జూనియర్ బుమ్రా వచ్చాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. తాజాగా రేర్ ఫీట్ సాధించాడు ఈ స్టార్ బౌలర్. ప్రపంచ క్రికెటర్ చరిత్రలోనే మూడు ఫార్మాట్స్ లో నెం.1 బౌలర్ గా ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. గతంలో వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో నిలిచిన బుమ్రా తాజాగా టెస్టుల్లో తొలి ప్లేస్ లోకి దూసుకొచ్చాడు. దీంతో ఈ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఈ వీడియో చూశాక.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Jasprit Bumrah: వరల్డ్‌ నెం.1గా బుమ్రా! క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!