Ben Stokes: వీడియో: విండీస్ బౌలర్ స్పిన్ మ్యాజిక్.. బిత్తరపోయిన స్టోక్స్!

Gudakesh Motie: ప్రస్తుత క్రికెట్​లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్​లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు స్టోక్స్. అలాంటోడ్ని బిత్తరపోయేలా చేశాడు విండీస్ స్పిన్నర్ మోతీ.

Gudakesh Motie: ప్రస్తుత క్రికెట్​లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్​లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు స్టోక్స్. అలాంటోడ్ని బిత్తరపోయేలా చేశాడు విండీస్ స్పిన్నర్ మోతీ.

ప్రస్తుత క్రికెట్​లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్​లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. క్రీజులో సెటిల్ అయితే ఏ బౌలర్​ను కూడా వదలకుండా శిక్షిస్తాడతను. భారీ స్కోర్లు బాదుతూ అపోజిషన్ టీమ్ నుంచి మ్యాచ్​ను లాగేసుకుంటాడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు ఇంగ్లండ్ కెప్టెన్. మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి అవసరమైతే డిఫెన్స్ చేస్తాడు స్టోక్స్. నార్మల్​గా అయితే అతడు మొదటి బాల్​ నుంచే హిట్టింగ్​కు దిగుతాడు. బజ్​బాల్ ఫార్ములా ప్రకారం భారీ షాట్లు బాదుతూ బౌలర్లకు నరకం చూపిస్తాడు. అలాంటోడ్ని ఔట్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ వెస్టిండీస్ బౌలర్​ స్పిన్ మ్యాజిక్​కు అతడు అల్లాడిపోయాడు.

విండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీ బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు స్టోక్స్. ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్​లో ఇది చోటు చేసుకుంది. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టోక్స్​ను ఓ ఊహించని బంతితో ఔట్ చేశాడు మోతీ. ఆఫ్ స్టంప్​కు దూరంగా అతడు వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయాడు స్టోక్స్. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయి లోపలకు దూసుకొచ్చింది. అప్పటికే షాట్​కు కమిట్ అయిన స్టోక్స్ బ్యాట్​ను ఊపేశాడు. కానీ బాల్ అతడి బ్యాట్​, ప్యాడ్​కు మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. బెయిల్స్ ఎగిరి దూరంగా పడటంతో స్టోక్స్ బిత్తరపోయాడు.

ఇదేం బాల్ రా నాయనా అంటూ షాకయ్యాడు స్టోక్స్. పాములా ఇన్ని మెలికలు తిరిగిందని ఆశ్చర్యపోయాడు. స్టోక్స్​ను ఔట్ చేయడంతో పాటు మరో వికెట్ కూడా తీశాడు మోతీ. అతడి బౌలింగ్ చూసిన క్రికెట్ లవర్స్ స్పిన్ మ్యాజిక్ అంటే ఇది భయ్యా.. సూపర్బ్​గా తిప్పాడంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 371 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీబియన్ టీమ్ ఇప్పుడు 4 వికెట్లకు 42 పరుగులతో ఉంది. మరి.. మోతీ స్పిన్ మ్యాజిక్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments