Nidhan
Gudakesh Motie: ప్రస్తుత క్రికెట్లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు స్టోక్స్. అలాంటోడ్ని బిత్తరపోయేలా చేశాడు విండీస్ స్పిన్నర్ మోతీ.
Gudakesh Motie: ప్రస్తుత క్రికెట్లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు స్టోక్స్. అలాంటోడ్ని బిత్తరపోయేలా చేశాడు విండీస్ స్పిన్నర్ మోతీ.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో ఉన్న బెస్ట్ బ్యాటర్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడు. క్రీజులో సెటిల్ అయితే ఏ బౌలర్‌ను కూడా వదలకుండా శిక్షిస్తాడతను. భారీ స్కోర్లు బాదుతూ అపోజిషన్ టీమ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. అతడ్ని ఔట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోవాల్సిందే. బెస్ట్ బాల్ వేస్తే తప్ప క్రీజును వీడడు ఇంగ్లండ్ కెప్టెన్. మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి అవసరమైతే డిఫెన్స్ చేస్తాడు స్టోక్స్. నార్మల్‌గా అయితే అతడు మొదటి బాల్ నుంచే హిట్టింగ్‌కు దిగుతాడు. బజ్‌బాల్ ఫార్ములా ప్రకారం భారీ షాట్లు బాదుతూ బౌలర్లకు నరకం చూపిస్తాడు. అలాంటోడ్ని ఔట్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ వెస్టిండీస్ బౌలర్ స్పిన్ మ్యాజిక్కు అతడు అల్లాడిపోయాడు.
విండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు స్టోక్స్. ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇది చోటు చేసుకుంది. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టోక్స్‌ను ఓ ఊహించని బంతితో ఔట్ చేశాడు మోతీ. ఆఫ్ స్టంప్‌కు దూరంగా అతడు వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయాడు స్టోక్స్. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయి లోపలకు దూసుకొచ్చింది. అప్పటికే షాట్‌కు కమిట్ అయిన స్టోక్స్ బ్యాట్‌ను ఊపేశాడు. కానీ బాల్ అతడి బ్యాట్, ప్యాడ్‌కు మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. బెయిల్స్ ఎగిరి దూరంగా పడటంతో స్టోక్స్ బిత్తరపోయాడు.
ఇదేం బాల్ రా నాయనా అంటూ షాకయ్యాడు స్టోక్స్. పాములా ఇన్ని మెలికలు తిరిగిందని ఆశ్చర్యపోయాడు. స్టోక్స్‌ను ఔట్ చేయడంతో పాటు మరో వికెట్ కూడా తీశాడు మోతీ. అతడి బౌలింగ్ చూసిన క్రికెట్ లవర్స్ స్పిన్ మ్యాజిక్ అంటే ఇది భయ్యా.. సూపర్బ్‌గా తిప్పాడంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 371 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీబియన్ టీమ్ ఇప్పుడు 4 వికెట్లకు 42 పరుగులతో ఉంది. మరి.. మోతీ స్పిన్ మ్యాజిక్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
WHAT A BALL FROM MOTIE. 🥶
– Stumps flying through a spinner is rare…!!!! pic.twitter.com/aZMm1R9DTO
— Johns. (@CricCrazyJohns) July 11, 2024