iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: గెలిచినా ఇంగ్లండ్‌ని భయపెడుతున్న కుర్రాడు! రెండో టెస్ట్‌లో విధ్వంసమే!

  • Published Jan 30, 2024 | 12:53 PM Updated Updated Jan 30, 2024 | 12:53 PM

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు జడేజా, రాహుల్‌ గాయాలతో దూరం అవ్వడంతో ఓ ముగ్గురు యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయితే.. వారిలో సర్ఫరాజ్‌ అనే కుర్రాడిని చూసి ఇంగ్లండ్‌ తెగ ఆందోళన చెందుతోంది. అతని కోసం గేమ్‌ ప్లాన్‌ను కూడా రెడీ చేసింది. అసలు ఇంగ్లండ్‌ ఎందుకు అంత భయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు జడేజా, రాహుల్‌ గాయాలతో దూరం అవ్వడంతో ఓ ముగ్గురు యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయితే.. వారిలో సర్ఫరాజ్‌ అనే కుర్రాడిని చూసి ఇంగ్లండ్‌ తెగ ఆందోళన చెందుతోంది. అతని కోసం గేమ్‌ ప్లాన్‌ను కూడా రెడీ చేసింది. అసలు ఇంగ్లండ్‌ ఎందుకు అంత భయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 30, 2024 | 12:53 PMUpdated Jan 30, 2024 | 12:53 PM
Sarfaraz Khan: గెలిచినా ఇంగ్లండ్‌ని భయపెడుతున్న కుర్రాడు! రెండో టెస్ట్‌లో విధ్వంసమే!

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో గెలిచి తమ పరువు నిలుపుకోవాలని చూస్తోంది. విశాఖపట్నం వేదికగా.. ఫిబ్రవరి 2 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టెస్టులో గెలిచి.. 1-1తో లెక్క సరిచేయాలని రోహిత్‌ సేన గట్టిపట్టుదలతో ఉంది. కానీ, తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ రెండో టెస్టుకు దూరం కావడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఇప్పటికే జట్టు మొత్తం యువ క్రికెటర్లతో నిండిపోయింది. ఇప్పుడున్న  కాస్త సీనియర్‌ ఆటగాళ్లు కూడా గాయాలతో దూరం అయ్యారు.

అయినా కూడా టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో టెస్టు గెలవాలని ఫిక్స్‌ అయింది. అందుకోసం ఓ ముగ్గురు యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకుంది. జడేజా, రాహుల్‌ గాయాలతో దూరం కావడంతో.. సర్ఫరాజ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌లను రెండో టెస్టు కోసం ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే.. వీరిలో సర్ఫరాజ్‌ ఎంపికపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. దేశవాళి క్రికెట్‌లో చాలా కాలంగా ఎంతో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ, ఇప్పుడు సర్ఫరాజ్‌కు అవకాశం వచ్చింది.

England is afraid of Sarfaraz!

కాగా.. సర్ఫరాజ్‌ ఎంపికతో భారత క్రికెట్‌ అభిమానులు ఎంత సంతోష పడుతున్నారో.. ఇంగ్లండ్‌ అంతకంటే ఎక్కువ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే టీమిండియాలో కోహ్లీ లేడు, తాజాగా జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాలతో రెండో టెస్టుకు దూరం అయ్యారు.. ఇక బలహీన పడిన టీమిండియాను రెండో టెస్టులోనూ ఓడించొచ్చు అని సంబరపడుతున్న ఇంగ్లండ్‌కు.. సర్ఫరాజ్‌ ఎంపికతో మన సెలక్టర్లు షాకిచ్చారు. ఇంగ్లండ్‌ భయానికి కారణం.. సర్ఫరాజ్‌ రంజీ రికార్డ్స్‌. గత మూడు రంజీల్లో సర్ఫరాజ్‌ గణాంకాలను చూస్తే..  ఒక్క ఇంగ్లండే కాదు ప్రపంచంలోని ప్రతి జట్టు భయపడాల్సిందే. 2019 నుంచి 2023 మధ్య మూడు రంజీ సీజన్లు ఆడి సర్ఫరాజ్‌ 17 మ్యాచ్‌ల్లో 2341 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ లెక్కలే ఇంగ్లండ్‌ను ఆందోళన పరుస్తున్నాయి. ఇప్పటికే సర్ఫరాజ్‌ కోసం గేమ్‌ ప్లాన్‌ను సైతం ఇంగ్లండ్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. మరి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఇంగ్లండ్‌ను భయపెడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.