యాషెస్ సిరీస్ అందరూ ఊహించినట్లే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య మ్యాచ్‌లు చాలా ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మునివేళ్లపై నిల్చోబెడుతున్నాయి. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్లో టీమిండియాను ఓడించి మాంచి ఊపు మీదున్న కంగారూ టీమ్.. యాషెస్ సిరీస్‌లో అదే జోరును కొనసాగించింది. బూడిద కప్ కోసం జరుగుతున్న ఈ సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ అదరగొట్టింది. ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. బజ్‌బాల్ స్టైల్ ఆటతీరుతో ఆసీస్‌కు చెక్ పెట్టాలనుకున్న ఇంగ్లండ్ తాను తీసుకున్న గోతిలో తానే పడింది.
యాషెస్ సిరీస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌కు పరాభవమే ఎదురైంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా, స్వదేశంలో టోర్నీ జరుగుతున్నా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆతిథ్య జట్టు పూర్తిగా విఫలమైంది. అయితే మూడో టెస్టులో మాత్రం స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమ్ ఇంగ్లండ్. కెప్టెన్ బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ అద్భుతంగా ఆడటంతో కంగారూ టీమ్ పనిపట్టింది. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లీష్ జట్టు.. సిరీస్‌లో గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది. కీలకంగా మారిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.
మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 317 రన్స్‌కే ఆలౌట్ చేసింది ఇంగ్లండ్ టీమ్. స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ 5 వికెట్లతో చెలరేగి.. ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 306 రన్స్‌తో ఉంది. ఆ టీమ్ ఓపెనర్ జాక్ క్రాలే (174 నాటౌట్), జో రూట్ (65 నాటౌట్) క్రీజులో ఉన్నారు. క్రాలే టీ20 స్టైల్ బ్యాటింగ్‌తో కంగారూ బౌలర్లను ఓ రేంజ్లో ఆటాడుకున్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఒక అరుదైన ఘతనను సాధించింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఒక రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది.
ఓవరాల్‌గా టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ రికార్డుల్లోకి ఎక్కింది. అసలు ఆ రికార్డు ఏంటంటే.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే జట్టులో కనీసం 10 మంది ప్లేయర్లు 1,000 రన్స్ చేశారు. గతంలో 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్‌లో ఐసీసీ వరల్డ్ ఎలెవన్ టీమ్ ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ టీమ్‌లోని 10 మంది ఆటగాళ్లు వెయ్యి పరుగుల మార్కును దాటారు. అప్పటి టీమ్‌లో ఒక్క స్టీవ్ హార్మిసన్ (743 రన్స్) తప్ప అందరూ 1,000 పరుగుల మార్క్‌ను దాటిన వారే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో జట్టులో కనీసం వెయ్యి రన్స్ చేసిన 10 మంది ప్లేయర్లు ఉన్నారు. కంగారూ టీమ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తుది జట్టులో మార్క్ వుడ్ (681) మినహా మిగిలిన పది మంది ఆటగాళ్లు 1,000 రన్స్ మార్కును దాటడం విశేషం.