iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లే.. ఇక అతిథి పాత్రలే: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జాఫ్రీ బాయ్‌కాట్. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అతడిపై సోషల్ మీడియా వేదిగా విమర్శలు గుప్పిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జాఫ్రీ బాయ్‌కాట్. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అతడిపై సోషల్ మీడియా వేదిగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Rohit Sharma: రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లే.. ఇక అతిథి పాత్రలే: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్

హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓటమితో భారత ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఇంగ్లాండ్ మాజీలు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జాఫ్రీ బాయ్‌కాట్. రోహిత్ పనైపోయిందంటూ, అతడు ఇక జట్టులో అతిథి పాత్రే చేయాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆ దిగ్గజ క్రికెటర్ పై ఫైర్ అవుతున్నారు.

రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ 2023లో సూపర్ ఫామ్ ప్రదర్శించాడు. కానీ ఏమైందో తెలీదు.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్, ఆఫ్గానిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో దారుణంగా విఫలం అయ్యాడు. దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి అడుగుపెట్టిన హిట్ మ్యాన్.. ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేశాడు. రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు ఆశించి, భంగపడ్డారు అభిమానులు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో అయినా రాణిస్తాడని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇక్కడా అదే సీన్ రిపీట్. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో దారుణంగా విఫలం అయ్యాడు రోహిత్. తొలి ఇన్నింగ్స్ లో 24, రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు.

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ క్రికెటర్ జాఫ్రీ బాయ్ కాట్ టీమిండియా సారథి రోహిత్ శర్మపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. “నా దృష్టిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే అతడిప్పుడు 37 సంవత్సరాలకు దగ్గరపడ్డాడు. అయితే రోహిత్ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ గత నాలుగు సంవత్సరాల్లో ఇండియాలో కేవలం రెండు టెస్ట్  సెంచరీలు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. అతడి కెరీర్ ముగింపు దశకు చేరుకుందని. ఇక రోహిత్ కు టీమిండియాలో మిగిలింది అతిథి పాత్రలే” అంటూ చెప్పుకొచ్చాడు బాయ్ కాట్. కాగా.. ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా రోహిత్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాయ్ కాట్ మీరు రోహిత్ ను తక్కువ అంచనా వేస్తున్నారు, అతడికి మరో వరల్డ్ కప్ ఆడే సత్తా ఉంది. అది మీరు గుర్తిస్తే మంచి అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేస్తున్నారు. మరి బాయ్ కాట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి