Somesekhar
ప్రపంచంలోకెల్లా ఆ టీమిండియా స్టార్ క్రికెటర్లే అత్యుత్తమమైన ప్లేయర్లని కితాబిచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోకెల్లా ఆ టీమిండియా స్టార్ క్రికెటర్లే అత్యుత్తమమైన ప్లేయర్లని కితాబిచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
ఏ రంగంలోనైనా చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. మీ రంగంలో అత్యుత్తమమైన వారు ఎవరు? తాజాగా ఇదే క్వశ్చన్ ప్రపంచ క్రికెట్ లో ఉత్పన్నం అయ్యింది. ఇక దీనికి ఆన్సర్లుగా సచిన్, విరాట్ కోహ్లీ, పాంటింగ్, బ్రియన్ లారా, బ్రాడ్ మన్ అంటూ ఎన్నో పేర్లు తెరపైకి వస్తూ ఉంటాయి. తమకు ఇష్టమైన ప్లేయర్ పేరును చెబుతూ ఉంటారు అభిమానులు. మరి ఇదే ప్రశ్న ఓ స్టార్ ప్లేయర్ కు ఎదురైతే? అతడు ఇచ్చే సమాధానం వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఆన్సరే ఇచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. ప్రపంచంలోకెల్లా ఆ టీమిండియా స్టార్ క్రికెటర్లే అత్యుత్తమమైన ప్లేయర్లని కితాబిచ్చాడు.
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టీమిండియాలోని ఓ ఇద్దరి ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్ లో వీరిద్దరే అత్యుత్తమ ఆటగాళ్లు అని చెప్పుకొచ్చాడు. రూట్ చెప్పింది మరెవరి గురించో కాదు.. రన్ మెషిన్ కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి. తాజాగా ఓ కార్యక్రమంలో జో రూట్ మాట్లాడుతూ..”ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే? వీరు తమ ఆటతీరుతో యంగ్ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక ఈ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. భారత జట్టు దూకుడుగానే ఆడుతోంది. కోహ్లీ, రోహిత్ లు క్రీజ్ లో కుదురుకుంటే వారిని ఆపడం కష్టం. అందుకే వారిని వీలైనంత త్వరగా ఔట్ చేయాడనికి ప్రయత్నిస్తాం. అయితే కోహ్లీ అందుబాటులో లేకపోవడం టీమిండియా దురదృష్టం.. మా అదృష్టం” అని చెప్పుకొచ్చాడు జో రూట్.
ఇక ఇండియా ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. కాగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. వారు అక్కడ ఐసీసీ ఏర్పాటు చేసిన గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో టెస్ట్ గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియా.. అదే జోరును నెక్ట్స్ మ్యాచ్ లోనూ చూపించాలని ఆరాటపడుతోంది. మరి ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అత్యుత్తమ క్రికెటర్లు అన్న జో రూట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: Ishan Kishan: అందుకే జట్టుకు ఇషాన్ కిషన్ దూరం! వెలుగులోకి సంచలన నిజాలు