iDreamPost
android-app
ios-app

Gus Atkinson: లార్డ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ విధ్వంసం! 8వ స్థానంలో వచ్చి సెంచరీ..

  • Published Aug 30, 2024 | 7:06 PM Updated Updated Aug 30, 2024 | 7:06 PM

ENG vs SL, Gus Atkinson Century: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విధ్వంసం సృష్టించాడు ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్. 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఏకంగా సెంచరీ బాదేశాడు.

ENG vs SL, Gus Atkinson Century: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విధ్వంసం సృష్టించాడు ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్. 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఏకంగా సెంచరీ బాదేశాడు.

Gus Atkinson: లార్డ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ విధ్వంసం! 8వ స్థానంలో వచ్చి సెంచరీ..

శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ అదరగొడుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. అదే జోరును రెండో టెస్ట్ లో కూడా చూపిస్తోంది. లార్డ్స్ వేదికగా ప్రారంభం అయిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జో రూట్(143) భారీ శతకానికి తోడు బౌలర్ గస్ అట్కిన్సన్(118) 8వ స్థానంలో వచ్చి లంక బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

లార్డ్స్ లో ఇంగ్లండ్ యువ బౌలర్ గస్ అట్కిన్సన్ తన బ్యాటింగ్ తో లార్డ్స్ లో తుఫాన్ తెప్పించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ లో 8వ స్థానంలో వచ్చి మెరుపు బ్యాటింగ్ తో శతకంతో కదంతొక్కాడు ఈ యంగ్ ప్లేయర్. ఇప్పటి వరకు తన బౌలింగ్ స్కిల్స్ తో అదరగొట్టిన ఈ స్టార్.. తాజాగా జరుగుతున్న టెస్ట్ లో లంక బౌలర్లకు బ్యాట్ తో చుక్కలు చూపించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి.. ఎవ్వరూ ఊహించని విధంగా ఫోర్లు, సెక్సులతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 103 బంతుల్లోనే అట్కిన్సన్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 115 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు.

కాగా.. ఈ శతకంతో లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు దక్కించుకున్నాడు అట్కిన్సన్. దాంతో పాటుగా లార్డ్స్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ బాదిన 6వ ప్లేయర్ గా నిలిచాడు. గతంలో స్టువర్ట్ బ్రాడ్, గుబ్బి అలెన్, బెర్నార్డ్ జలియన్, రే ఇల్లింగ్ వర్త్, అజిత్ అగార్కర్ లు ఈ గ్రౌండ్ లో 8వ స్థానంలో వచ్చి శతకాలు బాదారు. ఇక ఈ మ్యాచ్ లో అంతకు ముందు జో రూట్ (143) భారీ సెంచరీ సాధించాడు. వీరిద్దరు రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 427 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరి 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీ చేసిన ఇంగ్లండ్ బౌలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.