Milan Rathnayake: 41 ఏళ్ల రికార్డు బ్రేక్.. డెబ్యూ మ్యాచ్‌లో లంక క్రికెటర్ సంచలనం!

England vs Sri Lanka: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఓ శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత సాధించాడు. 41 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

England vs Sri Lanka: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఓ శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత సాధించాడు. 41 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికేనని కొందరు క్రికెటర్లు నిరూపిస్తుంటారు. పాత రికార్డులకు పాతర వేస్తూ సంచలనాలు సృషించడం అలవాటుగా మార్చుకుంటారు. రికార్డుల గురించి తెలుసుకునేందుకు ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి ఇవి వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ రికార్డు గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక శ్రీలంక క్రికెటర్ డెబ్యూ మ్యాచ్ లోనే సంచలనం సృష్టించాడు. 41 ఏళ్ల అరుదైన రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇది చోటుచేసుకుంది. లంక అరంగేట్ర ఆటగాడు మిలన్ రత్నాయక్ రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆ టీమ్ 74 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిందా జట్టు. ఆ దశలో క్రీజులోకి వచ్చాడు డెబ్యుటెంట్ మిలన్ రత్నాయకే. ధనంజయ డిసిల్వా (84 బంతుల్లో 74)తో అతడు జతకలిశాడు. ఇద్దరూ వికెట్ల పతనానికి అడ్డు వేయడమే గాక ఒక్కో పరుగు తీస్తూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో రత్నాయకే అరుదైన రికార్డు నెలకొల్పాడు. 9వ పొజిషన్ లో బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోర్ (72) చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 1983లో టీమిండియా ప్లేయర్ బల్వీందర్ సింగ్ సంధు పాకిస్థాన్ మీద చేసిన 71 స్కోర్ రికార్డును మిలన్ బ్రేక్ చేశాడు.

బల్వీందర్ సింగ్ సంధు రికార్డు 41 ఏళ్ల తర్వాత బద్దలైంది. తొమ్మిదో వికెట్ కు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన మిలన్ రత్నాయకే.. డెబ్యూ మ్యాచ్ లోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగానూ చరిత్ర పుటల్లోకెక్కాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న అతడు.. 6 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 72 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వా ఔట్ అయినా రత్నాయకే ఆఖరి వరకు పోరాడాడు. వీళ్ల ఇన్నింగ్స్ ల కారణంగానే ఎప్పుడో చాప చుట్టేయాల్సిన లంక 200 స్కోరు అయినా దాటగలిగింది. వీళ్లిద్దరూ తప్పితే పర్యాటక బ్యాటర్లలో ఇంకెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో 3 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లీష్ టీమ్ తొలి రోజు ఆట ముగిసేసరికి 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయితే మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. లంక బౌలర్లు మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

Show comments