iDreamPost
android-app
ios-app

దంచికొట్టిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!

  • Published Feb 29, 2024 | 9:18 AM Updated Updated Feb 29, 2024 | 9:18 AM

తెలుగు తేజం, హైదరాాబాదీ కుర్రాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. తాజాగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే..

తెలుగు తేజం, హైదరాాబాదీ కుర్రాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. తాజాగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే..

దంచికొట్టిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!

టీమిండియా ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ రెచ్చిపోయాడు. ప్రస్తుతం నవీ ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ బ్యాటర్. తాజాగా సెంట్రల్ రైల్వే టీమ్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 43 బంతుల్లోనే..

తిలక్ వర్మ.. టీమిండియాలో సత్తాచాటుతున్నాడు ఈ తెలుగు తేజం. ప్రస్తుతం నవీ ముంబై వేదికగా జరగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో రిలయన్స్ 1 టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఇక ఈ టోర్నీలో భాగంగా తాజాగా బుధవారం(ఫిబ్రవరి 28) సెంట్రల్ రైల్వేతో తలపడింది రిలయన్స్ 1 టీమ్. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ లో కేవలం 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులతో 91 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. ఏకంగా 206 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టించాడు తిలక్. రైల్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించాడు. అతడికి తోడు శ్వాలిక్ శర్మ 36 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్ తో 56 పరుగులతో రాణించాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్ కు 122 పరుగులు జోడించారు.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ 1 టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ రైల్వే టీమ్ ఓవర్లు మెుత్తం ఆడి 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసి.. 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి కనిపించకపోవడంతో, హార్దిక్ కు మళ్లీ ఏమైంది? అంటూ ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. గాయం మళ్లీ తిరగబెట్టిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పాండ్యా, తిలక్ వర్మలు ఇద్దరూ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదికూడా చదవండి: WPLలో ఊహించని ఘటన.. లేడీ క్రికెటర్లపైకి దూసుకొచ్చిన ఫ్యాన్! ఆ తర్వాత..