టీమిండియాను బెంబేలెత్తించిన 20 ఏళ్ల కుర్రాడు! ఎవరీ దునిత్ వెల్లలాగే?

  • Author Soma Sekhar Updated - 06:31 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Updated - 06:31 PM, Tue - 12 September 23
టీమిండియాను బెంబేలెత్తించిన 20 ఏళ్ల కుర్రాడు! ఎవరీ దునిత్ వెల్లలాగే?

ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా తన జోరును చూపించింది. టాపార్డర్ అద్భుతంగా రాణించడంతో.. ఈ మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది భారత జట్టు. ఇదే జోరును శ్రీలంకపై కూడా చూపాలనుకుంది. అయితే ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ.. ఓ 20 ఏళ్ల లంక యువ సంచలనం బౌలింగ్ కు ఒక్కసారిగా టాపార్డర్ కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలతో పాటుగా శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్,  హార్దిక్ పాండ్యాల వికెట్ లను సైతం పడగొట్టిన ఆ యువ సంచలనం పేరే దునిత్ వెల్లలాగే.

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో తలపడుతున్న భారత్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా తన జోరును కొనసాగించబోతోందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కానీ అసలు కథ ఇక్కడే మెుదలైంది. అప్పటి వరకు టీమిండియాదే పై చేయి అనుకున్న ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు 20 ఏళ్ల లంక కుర్ర బౌలర్ దునిత్ వెల్లలాగే. వరుస ఓవర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్లు అయిన గిల్, రోహిత్, విరాట్, రాహుల్ లను పెవిలియన్ కు పంపించి.. లంక జట్టును గేమ్ లోకి తీసుకొచ్చాడు.

తొలుత కుదురుకున్నాడు అనుకున్న గిల్ ను 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బౌల్డ్ చేసి వికెట్ల పతనం ఆరంభించాడు వెల్లలాగే. ఆ తర్వాత వెంటనే గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? విరాట్ కోహ్లీ ఈ ఓవర్ మెుత్తం ఆడి లాస్ట్ బాల్ కు అవుట్ కాగా.. ఓవర్ మెయిడెన్ అయింది. దీంతో 90 పరుగుల వద్ద టీమిండియా తన రెండో వికెట్ ను కోల్పోయింది. ఇక అర్ధశతకంతో మంచి ఊపులో కనిపించిన రోహిత్ ను కూడా 53 రన్స్ వద్ద బౌల్డ్ చేశాడు. దీంతో పటిష్ట స్థితిలో ఉంటుందనుకున్న టీమిండియా 15 ఓవర్లకే 90 రన్స్ కు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టీమిండియా టాపార్డర్ ను కుప్పకూల్చడంలో లంక యువ సంచలనం దునిత్ వెల్లలాగే సక్సెస్ అయ్యాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అయిన విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, గిల్, పాండ్యా లను వెల్లలాగే బోల్తా కొట్టించిన తీరు అమోఘమనే చెప్పాలి. 2022లోనే లంక టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర బౌలర్.. సత్తా చాటుతున్నాడు. ఆడేది టీమిండియాతోనని, అందులోనూ విరాట్, రోహిత్ లాంటి బ్యాటర్లకు బౌలింగ్ చేస్తున్నానన్న కొద్ది భయం కూడా వెల్లలాగేలో కనిపించలేదు.  కొలంబోలో పుట్టిన వెల్లలాగే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడెక్స్ స్టైల్లో బౌలింగ్ చేస్తాడు.

కేవలం ఒక టెస్ట్ మ్యాచ్, 13 వన్డేలు మాత్రమే ఆడిన అనుభవం దునిత్ వెల్లలాగేకు ఉంది. అలాంటి బౌలర్ ను ఆడటంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు తడబడ్డారు. 2022లో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో లంక జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆసీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో 10 ఓవర్లకు 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది.. అది కూడా విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ కి కావడం విశేషం. మరి 20 ఏళ్లకే టీమిండియా స్టార్ బ్యాటర్లను బెంబేలెత్తించిన దునిత్ వెల్లలాగే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments