iDreamPost
android-app
ios-app

దునిత్ వెల్లలాగే.. ఫుట్ బాల్ ప్లేయర్ అవ్వాలని.. స్పిన్నర్ గా మారి..

  • Author Soma Sekhar Published - 08:14 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Published - 08:14 PM, Tue - 12 September 23
దునిత్ వెల్లలాగే.. ఫుట్ బాల్ ప్లేయర్ అవ్వాలని.. స్పిన్నర్ గా మారి..

దునిత్ వెల్లలాగే.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ట్రెండింగ్ లో ఉన్న పేరు. దానికి కారణంగా అతడి బౌలింగే. ప్రపంచ క్రికెట్ లో స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే జట్టు ఏదంటే? అందులో టీమిండియానే ముందువరుసలో ఉంటుంది. అలాంటి టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టి.. 5 వికెట్లను నేలకూల్చాడు ఈ లంక స్పిన్నర్. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన లంక స్పిన్నర్లలో ముత్తయ్య మురళీధరన్ ముందు వరుసలో ఉంటే.. ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండీస్ ఉంటాడు. తాజాగా వీరి జాబితాలోకి వచ్చి చేరాడు దునిత్ వెల్లలాగే. కేవలం 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ క్లాస్ టీమిండియా బ్యాటర్లను తన స్పిన్ మాయలో పడేశాడు ఈ కుర్రోడు. అయితే అతడు ముందుగా క్రికెటర్ అవ్వాలనుకోలేదట. ఓ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ అవ్వాలన్నది దునిత్ వెల్లలాగే కోరిక. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల క్రికెటర్ గా మారాల్సి వచ్చింది వెల్లలాగే.

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడింది. లంక యువ సంచలనం, స్పిన్నర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ విల విలలాడింది. ఈ మ్యాచ్ లో అతడు 10 ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి రోహిత్, గిల్, విరాట్, రాహుల్, పాండ్యా లాంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిపోతోంది. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లు సిద్దహస్తులు. అలాంటి బ్యాటర్లనే ముప్పుతిప్పలు పెట్టిన ఘనుడు దునిత్ వెల్లలాగే.

అయితే ఇంతటి ప్రతిభ కలిగిన దునిత్ మెుదట క్రికెటర్ అవ్వాలనుకోలేదు. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. జరిగింది దునిత్ జీవితంలో.  చిన్నతం నుంచి దునిత్ ఫుట్ బాల్ ఆటను ఎంతో ఇష్టపడేవాడు. దీంతో స్టార్ ఫుట్ బాల్ ఆటగాడిగా ఎదిగి, రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడాలన్నది దునిత్ కల. అయితే శ్రీలంకలో సాకర్ కు పెద్దగా క్రేజ్ లేకపోవడం, అవకాశాలు దక్కకపోవడంతో.. క్రికెట్ వైపు తన దృష్టిని మరల్చాడు. ఈ క్రమంలోనే స్పిన్నర్ గా మారి సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక తాను క్రికెట్ పాఠాలు నేర్చుకున్న కొలంబో గ్రౌండ్ లో టీమిండియా టాపార్డర్ ను బెంబేలెత్తించాడు ఈ యువ స్పిన్నర్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. జట్టులో రోహిత్(53), రాహుల్(39), ఇషాన్ కిషన్(33) పరుగులు చేశారు. ఇక లంక బౌలర్లలో నయా స్పిన్ సంచలనం దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో చెలరేగాడు. అతడికి తోడు చరిత అసలంక 4 వికెట్లతో రాణించాడు. మరి ఫుట్ బాలర్ అవ్వాల్సిన దునిత్ వెల్లలాగే.. స్పిన్నర్ గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్! అలాగే మరో రికార్డు కూడా..