iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీ టీమ్స్ అనౌన్స్​మెంట్.. టోర్నీలో ఆడే టీమిండియా స్టార్లు వీళ్లే!

  • Published Aug 14, 2024 | 8:50 PM Updated Updated Aug 14, 2024 | 8:50 PM

Duleep Trophy 2024: ఈ మధ్య భారత క్రికెట్​లో ఎక్కువగా ఓ టోర్నమెంట్ గురించి డిస్కషన్ నడుస్తోంది. అదే దులీప్ ట్రోఫీ. ఇందులో టీమిండియా స్టార్లు ఎవరెవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది.

Duleep Trophy 2024: ఈ మధ్య భారత క్రికెట్​లో ఎక్కువగా ఓ టోర్నమెంట్ గురించి డిస్కషన్ నడుస్తోంది. అదే దులీప్ ట్రోఫీ. ఇందులో టీమిండియా స్టార్లు ఎవరెవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది.

  • Published Aug 14, 2024 | 8:50 PMUpdated Aug 14, 2024 | 8:50 PM
దులీప్ ట్రోఫీ టీమ్స్ అనౌన్స్​మెంట్.. టోర్నీలో ఆడే టీమిండియా స్టార్లు వీళ్లే!

ఈ మధ్య భారత క్రికెట్​లో ఎక్కువగా ఓ టోర్నమెంట్ గురించి డిస్కషన్ నడుస్తోంది. అదే దులీప్ ట్రోఫీ. ఇందులో టీమిండియా స్టార్లు ఎవరెవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది. భారత జట్టుకు ఇప్పుడు మ్యాచ్​లు లేవు. బంగ్లాదేశ్ సిరీస్​ మొదలవడానికి ఇంకా నెల రోజుల టైమ్ ఉంది. దీంతో మెన్ ఇన్ బ్లూ క్రికెటర్లంతా రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు వెకేషన్స్​లో బిజీగా ఉంటే మరికొందరు ఇళ్ల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే సెప్టెంబర్ 6 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా పలువురు భారత ఆటగాళ్లను బీసీసీఐ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేయాలని బోర్డు కోరినట్లు వినిపించింది. ఈ తరుణంలోనే హిట్​మ్యాన్​ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

రోహిత్ ప్రాక్టీస్ ఫొటోలు చూసిన అభిమానులు అతడు దులీప్ ట్రోఫీ కోసమే సన్నద్ధమవుతున్నాడని అనుకున్నారు. అయితే అతడు ఆ టోర్నమెంట్​లో ఆడట్లేదని కన్ఫర్మ్ అయిపోయింది. దులీప్ ట్రోఫీ-2024లో ఆడే టీమ్స్​ను తాజాగా భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. ఈ లిస్ట్​లో రోహిత్, విరాట్​తో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరు కూడా లేదు. మరి.. ఈ టోర్నీలో ఎవరైనా భారత స్టార్లు ఆడుతున్నారా? లేదా? అనేదేగా మీ ప్రశ్న. ఈసారి దులీప్ ట్రోఫీ అదిరిపోనుంది. రోకో జోడీ, బుమ్రాను మినహాయిస్తే దాదాపుగా టీమిండియా స్టార్స్ అంతా ఈ టోర్నమెంట్​లో అలరించనున్నారు. ఈ టోర్నమెంట్ కోసం నాలుగు జట్లను బోర్డు ప్రకటించింది. అందులో టీమ్-ఏకు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ను కెప్టెన్​గా ఎంపిక చేసింది.

గిల్​తో పాటు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబె, తిలక్ వర్మ టీమ్-ఏ తరఫున దులీప్ ట్రోఫీ బరిలోకి దిగనున్నారు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ టీమ్-బీ తరఫున ఆడతారు. టీమ్-సీకి యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్​ను కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. ఈ జట్టులో గైక్వాడ్​తో పాటు సూర్యకుమార్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, రజత్ పాటిదార్ ఉన్నారు. టీమ్-డీని స్టార్ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్​ సారథిగా ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టులో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, హర్షిత్ రాణా ఉన్నారు. నేషనల్ డ్యూటీ లేని టైమ్​లో టీమిండియా ఆటగాళ్లను డొమెస్టిక్ క్రికెట్​లో ఆడించాలనే పంతాన్ని మొత్తానికి బోర్డు నెరవేర్చుకుందని ఈ టీమ్స్​ను చూసిన నెటిజన్స్ అంటున్నారు. ఇంత మంది స్టార్లు ఒకే టోర్నీలో ఆడితే అదిరిపోతుందని చెబుతున్నారు. మరి.. దులీప్ ట్రోఫీ మ్యాచ్​ల కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.