వీడియో: కోహ్లీ ఐకానిక్‌ షాట్‌ రిపీట్‌ చేసిన DK.. రెండు షాట్స్‌లో ఏది బెస్ట్‌?

Dinesh Karthik, IPL 2024: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ ఒక అద్భుతమైన షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను కోహ్లీ ఐకానిక్‌ షాట్‌తో కంప్యార్‌ చేస్తున్నారు. మరి రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..

Dinesh Karthik, IPL 2024: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ ఒక అద్భుతమైన షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను కోహ్లీ ఐకానిక్‌ షాట్‌తో కంప్యార్‌ చేస్తున్నారు. మరి రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ జరిగింది. చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌లో స్టేడియంలో ఈ మ్యాచ్‌ అట్టహాసంగా మొదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. 17వ ఐపీఎల్‌ సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా మొదలుపెట్టింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ కాస్త డీలా పడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సీనియర్‌ బ్యాటర్‌ దినేష్‌ కార్తిక్‌ ఒక సూపర్‌ డూపర్‌ షాట్‌ ఆడాడు. అతను ఆడిన షాట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డీకే ఆడిన షాట్‌ను కోహ్లీ 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌తో ఆడిన ఐకానిక్‌ షాట్‌తో పోల్చుతున్నారు కొంతమంది అభిమానులు. ఆ షాట్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆ జట్టు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ మంచి స్టార్‌ ఇచ్చాడు. కానీ, 8 ఫోర్లతో ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు. కానీ అతను అవుటైన వెంటనే రజత్‌ పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌ అవ్వడంతో 42 పరుగులకే ఆర్సీబీ 3 వికెట్లు కోల్సోయింది. వికెట్లు వెంటవెంటనే పడటంతో కోహ్లీ స్లోగా ఆడాడు. కొద్ది సేపటికి కోహ్లీ, కామెరున్‌ గ్రీన్‌ కూడా వెంట వెంటనే అవుట్‌ కావడంతో 11.4 ఓవర్లో ఆర్సీబీ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో అనుజ్‌ రావత్‌తో కలిసి, దినేష్‌ కార్తీక్‌ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేశాడు. రావత్‌-డీకే ఇన్నింగ్స్‌ల వల్ల ఆర్సీబీకి మంచి స్కోర్‌ దక్కింది. ఈ క్రమంలోనే డీకే కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు.

ఆర్సీబీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సీఎస్‌కే బౌలర్‌ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ తొలి బంతికి దినేష్‌ కార్తీక్‌ అదిరిపోయే షాట్‌ ఆడాడు. సూపర్‌ స్పీడ్‌తో మీదికి దూసుకొస్తున్న బాల్‌ను స్ట్రేయిట్‌గా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో స్ట్రేయిట్‌గా కొట్టిన భారీ సిక్స్‌ ఆ మ్యాచ్‌కే కాదు.. మొత్తం క్రికెట్‌కే హైలెట్‌గా నిలిచింది. అలాంటి షాట్‌ను ప్రపంచంలో ఏ క్రికెట్‌ ఆడలేందంటూ.. దిగ్గజ క్రికెటర్లు సైతం మెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు డీకే ఆడిన షాట్‌ను కొంతమంది కోహ్లీ ఆడిని ఐకానిక్‌ షాట్‌తో కంప్యార్‌ చేస్తున్నారు. ఆ షాట్‌కు ఈ షాట్‌కు చాలా తేడా ఉందని, డీకే ఆడింది మంచి షాటే అయినా కోహ్లీ షాట్‌ ఒక అద్భుతమని క్రికెట్‌ పండితులు అంటున్నారు. డీకే ఆడినింది క్రాష్‌ షాట్‌ అని, అలాంటి షాట్‌ను సాధారణంగానే క్రికెటర్లు ఆడుతూ ఉంటారని, కానీ, కోహ్లీ ఆడిన షాట్‌ను ఎవరు ఆడలేరని అంటున్నారు. మరి డీకే ఆడిన షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments