iDreamPost
android-app
ios-app

Dinesh Karthik: IPL చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డ్ ను నెలకొల్పిన దినేశ్ కార్తీక్!

DCతో జరిగిన మ్యాచ్ లో అత్యంత వరస్ట్ రికార్డ్ ను నెలకొల్పాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్ చరిత్రలోనే ఈ చెత్త రికార్డ్ సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు డీకే. ఆ వివరాల్లోకి వెళితే..

DCతో జరిగిన మ్యాచ్ లో అత్యంత వరస్ట్ రికార్డ్ ను నెలకొల్పాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్ చరిత్రలోనే ఈ చెత్త రికార్డ్ సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు డీకే. ఆ వివరాల్లోకి వెళితే..

Dinesh Karthik: IPL చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డ్ ను నెలకొల్పిన దినేశ్ కార్తీక్!

IPL 2024 సీజన్ ఫ్యాన్స్ గుండెల్లో చాలా ఏండ్లు యాదుంటది. అంతలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి టీమ్స్. సన్ రైజర్స్ భారీ స్కోర్లు చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్లు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యక్తిగత ఘనతలు తమ పేరిట లిఖించుకుంటున్నారు. కానీ కొంత మంది ప్లేయర్లు మాత్రం వరస్ట్ రికార్డ్ లను నమోదు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఓ చెత్త ఘనతను నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

దినేశ్ కార్తీక్.. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా కితాబు అందుకుంటున్నాడు. ధోని తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో గొప్ప ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ప్లేయర్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో 13 మ్యాచ్ ల్లో 313 పరుగులు చేశాడు. ఇక తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు డీకే. దీంతో తన ఖాతాలో ఓ వరస్ట్ రికార్డ్ ను వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి ప్లేయర్ గా పరమ చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దినేశ్ కార్తీక్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు డీకే 18 సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే రోహిత్ వరస్ట్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. రోహిత్ ఐపీఎల్ లో 17 సార్లు సున్నా రన్స్ కే ఔట్ అయ్యాడు. ఇక చెత్త లిస్ట్ లో మాక్స్ వెల్(17), సునీల్ నరైన్(16), పియూష్ చావ్లా(16) డకౌట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరి ఐపీఎల్ చరిత్రలోనే డీకే వరస్ట్ రికార్డ్ ను నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి