ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా తన సేవలను అందిస్తున్నాడు టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్. ఈ మెగాటోర్నీ తర్వాత కెప్టెన్ గా పగ్గాలు చేపట్టబోతున్నాడు డీకే. ఆ వివరాలు..
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా తన సేవలను అందిస్తున్నాడు టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్. ఈ మెగాటోర్నీ తర్వాత కెప్టెన్ గా పగ్గాలు చేపట్టబోతున్నాడు డీకే. ఆ వివరాలు..
దినేష్ కార్తీక్.. టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో కామెంటరీ టీమ్ లో కొనసాగుతున్నాడు డీకే. అయితే మరికొద్ది రోజుల్లో విజయ్ హజరే ట్రోఫీ 2023-24 సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ ట్రోఫీకి సంబంధించి తమిళనాడు జట్టుకు సారథిగా నియమించబడ్డాడు దినేష్ కార్తీక్. ఈ విషయాన్ని తమిళనాడు జట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
దినేష్ కార్తీక్ త్వరలోనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ 2023-24 సీజన్ కు సంబంధించి.. తమిళనాడు జట్టుకు కెప్టెన్ గా నియమించబడ్డాడు. డొమాస్టిక్ లిస్ట్-ఏ క్రికెట్ లో ఈ ట్రోఫీకి చాలా ప్రాముఖ్యత ఉంది. దినేష్ కార్తీక్ తమిళనాడు తరపున లిస్ట్-ఏ క్రికెట్ లో 252 మ్యాచ్ లు ఆడాడు. 12 సెంచరీలు, 39 అర్దశతకాలతో 7358 పరుగులు సాధించాడు డీకే. ఇక గత సీజన్ లో డీకే తన చివరి మ్యాచ్ ను సౌరాష్ట్రపై ఆడాడు.
కాగా.. రాబోయే ఐపీఎల్ కు సిద్దమైయ్యేందుకు విజయ్ హజారే ట్రోఫీ నాకు ఉపయోగపడుతుందని డీకే గతంలోనే తెలిపాడు. మరి బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపు పొందిన డీకే తమిళనాడు జట్టును ఏ మేరకు నడుపుతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దేశవాళీ క్రికెట్ లో దినేష్ కార్తీక్ అద్భుత ఆటతీరు కనబర్చడం మనకు తెలిసిన విషయమే. మరి తమిళనాడు జట్టు కెప్టెన్ గా డీకే నియామకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📢 Announcement‼️
Dinesh Karthik to lead Tamil Nadu for the upcoming Vijay Hazare Trophy 🤩🔥#tnca #tamilnadu #vijayhazaretrophy pic.twitter.com/7WdQvc8eOg
— TNCA (@TNCACricket) November 9, 2023