సౌతాఫ్రికా టూర్ కోసం యంగ్ టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. అయితే ఫ్లైట్ లో టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మిస్టరీ గర్ల్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
సౌతాఫ్రికా టూర్ కోసం యంగ్ టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. అయితే ఫ్లైట్ లో టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మిస్టరీ గర్ల్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆసీస్ తో టోర్నీ దిగ్విజయంగా ముగించుకున్న భారత జట్టు.. వెంటనే సౌతాఫ్రికా టూర్ కు బయలుదేరింది. ఈ సిరీస్ లో భాగంగా ప్రోటీస్ జట్టుతో 3 టీ20, 3 వన్డే, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో లాండ్ అయ్యారు టీమిండియా ప్లేయర్లు. అక్కడ వారికి ఘన స్వాగతం కూడా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ బ్యూటీ కూడా ఫ్లైట్ లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. భారత ఆటగాళ్లతో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరు? అంటూ నెటిజన్లు ఆరా తీయ్యడం మెుదలుపెట్టారు. మరి ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.
యంగ్ టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ కు బయలుదేరినప్పుడు భారత జట్టు స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ఫ్లైట్ లో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పిక్ లో రింకూతో పాటుగా అర్షదీప్, కుల్దీప్ మరికొందరు సహచర ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటుగా ఓ మిస్టరీ గర్ల్ కూడా ఉంది.ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీమిండియా ప్లేయర్లతో ఉన్నా ఆ బ్యూటీ ఎవరు? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మెుదలుపెట్టారు. తొలుత ఆమెను ఎయిర్ లైన్స్ సిబ్బంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె ఫ్లైట్ సిబ్బంది కాదు. గతంలో కూడా ఆమె టీమిండియా ప్లేయర్లతో దర్శనమిచ్చింది. దీంతో జట్టుతో తిరుగుతున్న ఈ బ్యూటీ ఎవరా? అని ఆరా తీస్తున్నారు.
భారత జట్టుతో పాటు సౌతాఫ్రికాకు వెళ్లిన ఈ బ్యూటీ పేరు రాజల్ అరోరా. ఆమె టీమిండియాకు అలాగే ఐపీఎల్ డిజిటల్ మీడియా మేనేజర్ గా పనిచేస్తోంది. గత 8 సంవత్సరాలుగా రాజల్ అరోరా బీసీసీఐలో పనిచేస్తోంది. ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. 2015 నుంచి రాజల్ BCCIలో విధులు నిర్వర్తిస్తూ వస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలతో కలిసి అనేక పర్యటనల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. తొలుత టీ20 మ్యాచ్ ల కోసం యంగ్ ప్లేయర్లు సఫారీ గడ్డపై అడుగుపెట్టారు. డిసెంబర్ 10 తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023