iDreamPost
android-app
ios-app

IPLకి ముందు CSK భారీ షాక్‌! స్టార్‌ బ్యాటర్‌ దూరం?

  • Published Mar 04, 2024 | 11:22 AM Updated Updated Mar 04, 2024 | 11:22 AM

Devon Conway, IPL 2024: మరో కొన్ని వారాల్లో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టైమ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Devon Conway, IPL 2024: మరో కొన్ని వారాల్లో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టైమ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 04, 2024 | 11:22 AMUpdated Mar 04, 2024 | 11:22 AM
IPLకి ముందు CSK భారీ షాక్‌! స్టార్‌ బ్యాటర్‌ దూరం?

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 20 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సూపర్‌ స్టార్‌ టీమ్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాల్గొననున్నాయి. ఈ బిగ్‌ ఫైట్‌తో ఐపీఎల్‌ స్టార్ట్‌ కానుండటంతో ఫ్యాన్స్‌ అంతా మరింత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ, ఈ క్రమంలోనే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ గాయంతో ఆటకు మే వరకు దూరం అయ్యాడు. దీంతో.. అతను ఐపీఎల్‌కు కూడా పూర్తిగా దూరం అవుతాడనే టాక్‌ వినిపిస్తోంది. ఆ ఓపెనర్‌ ఎవరు? అతనికి ఏమైందో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు డెవాన్‌ కావ్వె ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో గాయపడ్డాడు. దీంతో అతను రానున్న మూడు నెలలు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓపెనర్‌గా ఆడుతున్న కావ్వె..  ఐపీఎల్‌లోని తొలి విడతకు పూర్తి దూరం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మే వరకు కాన్వె గ్రౌండ్‌లో దిగేందుకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అతను ఆడటం కష్టం. అయితే.. ఇండియాలో లోక్‌సభ్‌ ఎన్నికలు ఉండటంతో.. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన తర్వాత.. దాని అనుగుణంగా.. మిగిలిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. ఇప్పటికైతే.. కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యల్‌ మాత్రమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 21 మ్యాచ్‌లు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7 వరకు జరగనున్నాయి.

అయితే.. కావ్వె లాంటి స్టార్‌ ఓపెనర్‌ జట్టుకు దూరం కావడం చెన్నై సూపర్‌ కింగ్స్‌ బాగా కంగారు పెట్టే అంశమే. ఎందుకంటే.. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి మంచి స్టార్ట్స్‌ అందించే కాన్వె.. ఇలా గాయంతో దూరమైతే.. మరో ఓపెనర్‌తో రుతురాజ్‌ బరిలోకి దిగాలి. కాన్వెతో కుదిరిన సమన్వయం.. మరో ఓపెనర్‌తో కుదురుతుందా? లేదా? అన్నది చూడాలి. పైగా రుతురాజ్‌, కావ్వె తప్పితే సీఎస్‌కే వద్ద మరో నిక్సారైన ఓపెనర్‌ లేకపోవడం మరో పెద్ద సమస్య. మరి ధోని ఎవరితో ఓపెనింగ్‌ చేయిస్తాడో చూడాలి. అజింక్యా రహానె ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి కాన్వె గాయంతో ఐపీఎల్‌కి దూరం అయితే.. సీఎస్‌కేపై ప్రభావం పడుతుందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.