Lady In Team India Supporting Staff: టీమిండియా స్టాఫ్ లో ఉన్న ఒకే ఒక్క మహిళ.. ఆమె ఎవరో తెలుసా?

టీమిండియా స్టాఫ్ లో ఉన్న ఒకే ఒక్క మహిళ.. ఆమె ఎవరో తెలుసా?

Details About One And Only Lady In Team India Staff: టీమిండియా వీడియోలు, ఫొటోల్లో ఈ మహిళ తరచూ కనిపిస్తూ ఉంటుంది. టీమిండియా టూర్లలో కూడా వెన్నంటే ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఈ లేడీ గురించి మీకు తెలుసా?

Details About One And Only Lady In Team India Staff: టీమిండియా వీడియోలు, ఫొటోల్లో ఈ మహిళ తరచూ కనిపిస్తూ ఉంటుంది. టీమిండియా టూర్లలో కూడా వెన్నంటే ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఈ లేడీ గురించి మీకు తెలుసా?

క్రికెట్ ప్రపంచంలో టీమిండియాకి ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ ప్రపంచాన్ని శాసించే సత్తా ఉంది. క్రికెట్ ముఖచిత్రంగా కూడా మన జట్టును చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా సత్తా చాటుతోంది. అయితే టీమిండియా ఈ స్థాయిలో ప్రదర్శనలు చేయాలి అంటే దాని వెనుక ఎంతో మంది కృషి, నిరంతరాయంగా సాగే శ్రమ ఉంటాయి. అందుకే ప్రతి విజయంలో టీమిండియా ఆటగాళ్లనే కాదు.. టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ఒకే ఒక్క మహిళ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎవరీమె అంటూ వెతుకులాట మొదలు పెట్టారు.

టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ అంటే చాలానే పోస్టులు ఉంటాయి. చాలానే బాధ్యతలు ఉంటాయి. అందుకోసం ఎంతో మందిని హైర్ చేసుకుంటారు. అలాగే ఈ మహిళ కూడా టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ లో కొనసాగుతోంది. నిజానికి ఫేస్ ఆఫ్ టీమిండియా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆమె నిర్వహించే బాధ్యతలు అంత చిన్నవికావు మరి. టీమిండియా గురించి మీరు ఏం చూడాలి అన్నా.. మీరు ఎలాంటి వార్త వినాలి అన్నా అంది ఆమె నుంచే రావాల్సి ఉంటుంది. టీమిండియాని వరల్డ్ క్రికెట్ లో ప్రత్యేకంగా చూపించేందుకు ఆ మహిళ చాలానే కృషి చేస్తుంటుంది. ఇప్పటికే మీకు ఆమె చేసే జాబ్ ఏంటే అర్థమైపోయి ఉండాలి.

ఆ మహిళ పేరు రాజల్ అరోరా. ఆమె టీమిండియాలో చాలా కీలకమైన పోస్ట్ లో కొనసాగుతోంది. టీమిండియా, ఐపీఎల్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ లకు సంబంధించి డిజిటల్ అండ్ మీడియా మేనేజర్ గా వ్యవహరిస్తోంది. అంటే డిజిటల్ పరంగా, మీడియా పరంగా టీమిండియాకి సంబంధించిన అన్ని అప్ డేట్స్, వార్తలు, విషయాలు అన్నీ ఈవిడే మేనేజే చేస్తుంది. అంటే వరల్డ్ క్రికెట్ లో టీమిండియాని ఎలా ప్రొజెక్ట్ చేయాలి? మన వాళ్లని ఎంత బాగా ఎలివేట్ చేయాలి అనే విషయాలను వీళ్లే నిర్ణయిస్తూ ఉంటారు. తగిన చర్యలు, పద్ధతులు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అందుకే ఈవిడను టీమిండియా ఫేస్ అని కూడా అనచ్చు.

ఇంక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ప్రదర్శన విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో అద్భుతంగా ప్రదర్శన చేసింది. పాక్ జట్టు మీద న్యూయార్క్ స్టేడియంలో అతి తక్కువ స్కోర్ చేసినా కూడా.. దానిని బాగా డిఫెండ్ చేయగలిగింది. 6 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇంక అమెరికాతో జరిగే మ్యాచ్ మీద అందరి కళ్లు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్ టీమ్ అంటే మినీ ఇండియా అనే పేరు ఉంది. అందుకే ఆ మ్యాచ్ మీద ఎక్కువ ఆసక్తి నెలకొంది.

Show comments