iDreamPost
android-app
ios-app

Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్​గా గంగూలీ? ప్లాన్ ప్రకారమే పాంటింగ్​ బయటకు!

  • Published Jul 13, 2024 | 10:15 PM Updated Updated Jul 13, 2024 | 10:56 PM

Delhi Capitals: ఐపీఎల్ పాపులర్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్​ మేనేజ్​మెంట్​లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ టీమ్ హెడ్ కోచ్​ రికీ పాంటింగ్​ను బాధ్యతల నుంచి తొలగించారు.

Delhi Capitals: ఐపీఎల్ పాపులర్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్​ మేనేజ్​మెంట్​లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ టీమ్ హెడ్ కోచ్​ రికీ పాంటింగ్​ను బాధ్యతల నుంచి తొలగించారు.

  • Published Jul 13, 2024 | 10:15 PMUpdated Jul 13, 2024 | 10:56 PM
Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్​గా గంగూలీ? ప్లాన్ ప్రకారమే పాంటింగ్​ బయటకు!

ఐపీఎల్​లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఢిల్లీ క్యాపిటల్స్​ ఒకటి. టీమిండియాకు ఆడే పలువురు స్టార్లతో పాటు ఫారెన్ ప్లేయర్స్​తో నిండిన ఆ జట్టు ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. కానీ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఎక్కువగా యంగ్​సర్ట్స్ ఉండే ఈ టీమ్ ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడుతూ అందరి మనసులు దోచుకుంటోంది. అలాంటి డీసీ టీమ్ మేనేజ్​మెంట్​లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆ జట్టుకు గత ఆరేళ్లుగా హెడ్ కోచ్​గా ఉంటూ సేవలు అందించిన ఆస్ట్రేలియా దిగ్గజం​ రికీ పాంటింగ్​ను ఆ పోస్ట్ నుంచి తాజాగా తొలగించారు. పాంటింగ్ కోచింగ్​లో క్యాపిటల్స్ ఒకసారి రన్నరప్​గా నిలిచింది. మరో రెండు మార్లు ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది. అయితే గత మూడేళ్లుగా మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది.

గత మూడు సీజన్లలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశకే పరిమితమైంది. పాయింట్స్ టేబుల్​లో ఆఖరి టీమ్స్​తో పోటీపడుతోంది. రిషబ్ పంత్ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టినా ఏ మార్పూ రాలేదు. పాంటింగ్​ కొత్త కుర్రాళ్లను సానబెట్టి టాలెంట్​ను బయటకు తీస్తున్నాడు. యంగ్​స్టర్స్, సీనియర్స్ కలయికతో మంచి టీమ్​ను తయారు చేశాడు. కానీ ఎందుకో విన్నింగ్ ట్రిక్​ను డీసీ పట్టుకోలేకపోతోంది. జట్టు దారుణ ప్రదర్శనపై అభిమానులతో పాటు యాజమాన్యం కూడా సీరియస్​గా ఉంది. అందుకే ప్లాన్ ప్రకారమే పాంటింగ్​ను కోచ్ బాధ్యతల నుంచి తప్పించారని తెలుస్తోంది. అయితే అతడి పోస్ట్​లోకి ఎవర్ని తీసుకొస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

పాంటింగ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బాధ్యతల్ని టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీకి అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే డీసీ మేనేజ్​మెంట్​లో అడ్వయిజరీగా ఉంటూ సేవలు అందిస్తున్న దాదాకు ప్రమోషన్ ఇవ్వాలని యాజమాన్యం డిసైడ్ అయిందట. పాంటింగ్ స్థానంలో మన దేశానికి చెందిన వ్యక్తినే కోచ్​గా తీసుకోవాలని ఢిల్లీ ఓనర్స్ అనుకున్నారట. ఆల్రెడీ గంగూలీ రూపంలో సాలిడ్ ఆప్షన్ ఉండటంతో అతడికే కోచింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. త్వరలో దాదా పేరును కొత్త కోచ్​గా అధికారికంగా ప్రకటిస్తారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక, బెంగాల్ క్రికెట్ బోర్డుతో పాటు భారత క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్​గా పని చేసిన గంగూలీ.. పూర్తి స్థాయి కోచ్​గా ఎప్పుడూ వర్క్ చేయలేదు. దీంతో అతడు డీసీ ఆఫర్​కు ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి.. దాదా డీసీ కోచ్​గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.