iDreamPost
android-app
ios-app

IPL ఆక్షన్ వేళ.. ఆధారాలతో SRH పరువు తీసిన డేవిడ్ వార్నర్!

David Warner On SRH Team: ఐపీఎల్ వేలంలో స్టార్లు ప్లేయర్లు సత్తా చాటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దులు కొట్టారు. ఇలాంటి తరుణంలో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టు పరువు తీసేశాడు.

David Warner On SRH Team: ఐపీఎల్ వేలంలో స్టార్లు ప్లేయర్లు సత్తా చాటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దులు కొట్టారు. ఇలాంటి తరుణంలో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టు పరువు తీసేశాడు.

IPL ఆక్షన్ వేళ.. ఆధారాలతో SRH పరువు తీసిన డేవిడ్ వార్నర్!

ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం మినీ వేలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు రూ.20 కోట్ల మార్క్ ని దాటేశారు. మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. ఏకంగా రూ.24.75 కోట్లకు కొనింది. మరోవైపు పాట్ కమ్మిన్స్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. కావ్య మారన్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేలుద అంటూ క్రికెట్ నిపుణులు, ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి తరుణంలో డేవిడ్ వార్నర్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పరవు తీసేశాడు. వార్నర్ చేసిన పని చూసిన ఫ్యాన్స్.. వాళ్లకి అలాగే జరగాలిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 మినీ వేలంలో కళ్లు చెదిరే రికార్డులు నమోదు అయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే వరల్డ్ కప్ కెప్టెన్ ని రూ.20.50 కోట్లతో సొంతం చేసుకుంది. హైదరాబాద్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా పొగడ్తలు వెల్లివెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్ చేసిన పని వారి పరువును కూడా తీసేస్తోంది. విషయం ఏంటంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ ని రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. తమ జట్టు సభ్యుడు భారీ ధరకు హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. ఆ విషయాన్ని డేవిడ్ వార్నర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో డేవిడ్ వార్నర్ ని బ్లాక్ చేశారు. అందువల్ల అతను ట్రావిస్ హెడ్ పోస్టుని షేర్ చేయలేకపోయాడు. అయితే అదే విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టాడు.

“ట్రావిస్ హెడ్ పోస్టును రీపోస్ట్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పాట్ కమ్మిన్స్ పోస్టును కూడా రీపోస్ట్ చేయలేకపోయాను అంటూ స్టోరీ పెట్టాడు. దాంతో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్- వార్నర్ మధ్య ఉన్న పొరపచ్చాలు తెరపైకి వచ్చినట్లు అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వార్నర్ చేసిన సేవలు అందరికీ తెలిసిందే. హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వార్నర్ కూడా మన తెలుగువాడే అనే భావనకు ఫ్యాన్స్ వచ్చేశారు. అయితే వార్నర్ తో హైదరాబాద్ జట్టు యాజమాన్యం ప్రవర్తించిన తీరు మాత్రం కేవలం డేవిడ్ వార్నర్ ని మాత్రమే కాకుండా.. తెలుగు అభిమానులను కూడా ఎంతో బాధించింది. ఆ తర్వాత వార్నర్ సమయం దొరికినప్పుడల్లా తన అసహనాన్ని, తాను ఎదుర్కొన్న అవమానాలను ఎత్తిచూపుతూనే ఉన్నాడు. అలా ఎన్నిసార్లు జరిగినా అభిమానులు డేవిడ్ వార్నర్ వేపే ఉన్నారు. ఇప్పుడు కూడా హెదరాబాద్ ఫ్యాన్స్, తెలుగు క్రికెట్ అభిమానులు వార్నర్ కే మద్దతు తెలుపుతున్నారు. మరి.. డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేయడం.. ఆ విషాన్ని ఇలా పోస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.