iDreamPost
android-app
ios-app

చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా! లేకుంటే కప్పు ఇండియాదే

  • Author Soma Sekhar Published - 10:19 AM, Thu - 23 November 23

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రణాళికల్లో భాగంగా.. చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకుపోయింది. మరి ఆసీస్ ఫస్ట్ అనుకున్న ప్లాన్ ఏంటి? చివరి నిమిషంలో ఎందుకు మర్చుకోవాలనుకుంది?

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రణాళికల్లో భాగంగా.. చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకుపోయింది. మరి ఆసీస్ ఫస్ట్ అనుకున్న ప్లాన్ ఏంటి? చివరి నిమిషంలో ఎందుకు మర్చుకోవాలనుకుంది?

  • Author Soma Sekhar Published - 10:19 AM, Thu - 23 November 23
చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా! లేకుంటే కప్పు ఇండియాదే

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ఎత్తుగడలు ఏం చేసైనా సరే ప్రత్యర్థిని పడగొట్టి.. వరల్డ్ కప్ ను ముద్దాడాలన్నదే ఇండియా-ఆసీస్ జట్ల గోల్. ఇందుకోసం ఇరు జట్లు కూడా తమ స్ట్రాటజీని ఉపయోగించి, మాస్టర్ ప్లాన్స్ రెడీ చేసుకున్నాయి. కానీ ప్రణాళికల్లో భాగంగా.. చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకున్న ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకుపోయింది. మరి ఆసీస్ ఫస్ట్ అనుకున్న ప్లాన్ ఏంటి? చివరి నిమిషంలో ఎందుకు మర్చుకోవాలనుకుంది? ఆ వివరాలు ఇప్పుడు తెసుకుందాం.

ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియాపై 6 వికెట్ల తేడాతో గెలిచి.. 6వ వరల్డ్ కప్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియాలు తమ ప్లాన్లతో బరిలోకి దిగారు. అయితే అనుకున్న ప్రణాళికను చివరి నిమిషంలో మార్చుకుని కప్పు కొట్టేసింది కంగారూ టీమ్. ఈ విషయాన్ని స్వయంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెల్లడించినట్లుగా ఓ యూట్యూబ్ ఛానల్ కు చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్. అసలు ఆసీస్ చివరి నిమిషంలో మార్చుకున్న ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

“ఫైనల్ మ్యాచ్ కు ముందు రోజు రాత్రి మేమంతా తీవ్రంగా ఆలోచించాం. దాదాపు రెండు గంటల పాటు జట్టు స్థితి, గణాంకాలు, ఉపయోగించాల్సిన ప్లాన్ల గురించి చర్చించుకున్నాం. ఇక ఫస్ట్ మేము టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోర్ సాధించాలన్న నిర్ణయానికి వచ్చాము. కానీ మెజారిటీ టీమ్ మెంబర్స్ అభిప్రాయం సేకరించగా.. వారు తొలుత టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుద్దామని అనుకున్నాం. అదే అమలు చేశాం” అని వార్నర్ చెప్పుకొచ్చినట్లు ఓ యూట్యూబ్ ఛానల్ కు వెల్లడించాడు మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్. కాగా.. ఆసీస్ టీమ్ ముందుగా అనుకున్నట్లుగా బ్యాటింగ్ చేస్తే.. కప్ టీమిండియానే గెలిచేదని సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.