iDreamPost
android-app
ios-app

WTC 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానం.. అయినా టెన్షన్ లో టీమిండియా! ఎందుకంటే?

  • Published Sep 24, 2024 | 10:03 AM Updated Updated Sep 24, 2024 | 10:03 AM

WTC 2023-2025, Team India: ప్రస్తుతం WTCలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీమిండియాకు ఓ టెన్షన్ ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

WTC 2023-2025, Team India: ప్రస్తుతం WTCలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీమిండియాకు ఓ టెన్షన్ ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

WTC 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానం.. అయినా టెన్షన్ లో టీమిండియా! ఎందుకంటే?

బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా.. అదే జోరును రెండో మ్యాచ్ లో కూడా చూపించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ ను చూస్తే.. అది పెద్ద విషయం కాకపోవచ్చు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025లో భాగంగా ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఆ వెంటనే నవంబర్ లో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది టీమిండియా. ఇక ప్రస్తుతం WTCలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీమిండియాకు ఓ టెన్షన్ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 లో టీమిండియా ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడి 86 పాయింట్లతో 71.67 విన్నింగ్ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లు ఆడి 90 పాయింట్లతో 62.50 విన్నింగ్ శాతంతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. WTC ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకునే క్రమంలో టీమిండియాకు టెన్షన్ లేదు అని కచ్చితంగా మాత్రం చెప్పలేం. ఇక ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే భారత జట్టు త్వరలో ఆడబోయే 9 మ్యాచ్ ల్లో కనీసం 6 మ్యాచ్ ల్లో అయినా గెలవాలి. అప్పుడే ఫైనల్ కు టీమిండియా వెళ్తుంది.

ఇలా జరగని పక్షంలో కనీసం 5 మ్యాచ్ ల్లో గెలిచి అయినా.. మరో మ్యాచ్ ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో భారత జట్టు WTC ఫైనల్ కు వెళ్తుంది. ఇక టీమిండియా ఆడబోయే 9 టెస్టుల్లో బంగ్లాదేశ్ తో మిగిలిన మ్యాచ్ ఒకటి, న్యూజిలాండ్ తో మూడు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ 9 మ్యాచ్ ల్లో కనీసం 5 గెలిచి, ఒకటి డ్రా చేసుకుంటే భారత్ కు  ఎలాంటి ఢోకా ఉండదు. అలా కాని సమయంలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో అయినా ఉండాలి. దాంతో టీమిండియాకు టెన్షన్ ఉందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత జట్టు ఫామ్ చూస్తుంటే WTC ఫైనల్ కు చేరడం అంత పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ.. ఆసీస్ ను వారి గడ్డపైనే ఓడించడం అంత తేలిక కాదనే అభిప్రాయాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.