SNP
ఆస్ట్రేలియా ఆటలోనే కాదు.. స్లెడ్జింగ్‌లోనూ ఛాంపియన్ జట్టే. అందులో ఆ జట్టును ఢీ కొట్టే జట్టు లేదు. నోటీ దూలతో ప్రత్యర్థులను ఏదో ఒకటి అనడం వారికి బాగా అలవాటు. అదే అలవాటును తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా చూపించారు.
ఆస్ట్రేలియా ఆటలోనే కాదు.. స్లెడ్జింగ్‌లోనూ ఛాంపియన్ జట్టే. అందులో ఆ జట్టును ఢీ కొట్టే జట్టు లేదు. నోటీ దూలతో ప్రత్యర్థులను ఏదో ఒకటి అనడం వారికి బాగా అలవాటు. అదే అలవాటును తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా చూపించారు.
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని ఫైరీ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఆటగాళ్ల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు, మాటల యుద్ధం జరగలేదు. ఆ లోటును ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీరుస్తున్నట్లు కనిపించారు. అయితే.. ఈ సారి ఇది ఆసీస్ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపించింది. ఈ మధ్య కాలంలో స్లెడ్జింగ్ అనే మాట పెద్దగా వినపడకపోయినా.. స్లెడ్జింగ్ అనే పదానికి ఆస్ట్రేలియా పెట్టింది పేరు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా తమకు బాగా అలవాటు అయిన స్టెడ్జింగ్‌ను బయటపెట్టింది. అది కూడా ఒక పసికూన జట్టు మీద.
సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌పై అలాగే పటిష్టమై బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని ఆఫ్ఘనిస్థాన్ 291 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘాన్ కాన్ఫిడెన్స్ భారీగా పెరిగిపోయింది. ఆసీస్‌పై గెలిస్తే.. ఆఫ్ఘాన్‌కు సెమీస్ ఛాన్స్‌ను మరింత పెరుగుతాయి. అందుకే బౌలింగ్‌లో కూడా ఆఫ్గాన్ జట్టు అగ్రెషన్ చూపించింది. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ వికెట్ తీసి నవీన్ ఉల్ హక్ ఆసీస్ భారీ షాకిచ్చాడు. దీంతో ఆసీస్‌లో ఓటమి భయం మొదలైంది. వెంటనే చిన్న జట్టు అని కూడా చూడకుండా ఆఫ్ఘాన్‌పై స్లెడ్జింగ్ దిగారు. హెడ్ అవుటైన తర్వాత.. క్రీజ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్.. ఆఫ్టాన్ బౌలర్లు రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌పై నోరు పారేసుకుని.. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అయితే అది పెద్దగా పనిచేయలేదు. ఆ తర్వాత వెంటవెంటనే ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయింది. పేసర్లు నవీన్ ఉల్ హక్ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను వణికించారు. మొత్తం మీద 91 పరుగులకే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్ ఆదుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఇన్నింగ్స్‌గా, చిరస్థాయిలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌లా డబుల్ సెంచరీతో ఆసీస్‌కు అద్వితీయమైన విజయాన్ని అందించారు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఓ ఛాంపియన్ ప్లేయర్‌లా ఆడాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న ఆసీస్‌ను గెలిపించాడు. అయితే.. ఆరంభంలో వార్నర్, మార్ష్ చేసిన స్లెడ్జింగ్ మాత్రం క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Things are heating-up in Mumbai. pic.twitter.com/MAvph3m0fE
— CricTracker (@Cricketracker) November 7, 2023