iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించిన పాకిస్థాన్‌ క్రికెటర్‌!

  • Published Jan 23, 2024 | 11:36 AM Updated Updated Jan 23, 2024 | 11:36 AM

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ సైతం బాల రాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించారు. అతనెవరో? ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ సైతం బాల రాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించారు. అతనెవరో? ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 23, 2024 | 11:36 AMUpdated Jan 23, 2024 | 11:36 AM
Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించిన పాకిస్థాన్‌ క్రికెటర్‌!

అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. చాలా మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభం కనుల పండువగా సాగింది. దీంతో.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనని వారు.. సోషల్‌ మీడియాలో అకౌంట్‌ల నుంచి రామయ్య ఫొటోలను షేర్‌ చేస్తూ.. తమ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ సైతం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై స్పందించడం విశేషంగా మారింది. ఆ క్రికెటర్‌ మరెవరో కాదు.. దానిష్‌ కనేరియా. ఈ పాకిస్థానీ మాజీ స్పిన్నర్‌ హిందువనే విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు కాడి.. ఇండియాపై కూడా మంచి ప్రదర్శన కనబర్చి.. తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే.. ఎంత పాకిస్థాన్‌లో ఉన్నా.. తన మూలాలను ఏనాడు వదులుకోలేదు. పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు ఆడే సమయంలో మతం మారాలని తనపై చాలా ఒత్తిడి వచ్చిందని అయినా కూడా తాను మారలేదని కనేరియా పలు సందర్భాల్లో చెప్పుకోచ్చాడు.

Pak cricketer's tweet on Ayodhya Ram!

ఇప్పుడు అయ్యోధలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో కనేరియా తన సంతోషం వ్యక్తం చేశాడు. ‘శుభాకాంక్షలు.. భగవాన్‌ రామ్‌ వచ్చేశారు’ అంటూ కనేరియా ట్వీట్‌ చేశాడు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. అనేక ఏళ్లుగా పోరాటాలు, వివాదాలు, ఘర్షణల తర్వాత.. రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రామ మందిర నిర్మాణం, బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠతో మన దేశంలోని హిందువులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషించారు. మరి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై పాక్‌ క్రికెటర్‌ దానిష్‌ కనేరియా స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.