iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: హార్ధిక్‌ పాండ్యాకు తలనొప్పిగా మారిన సూర్య! ఏమి జరిగిందంటే?

  • Published Dec 04, 2023 | 12:49 PM Updated Updated Dec 04, 2023 | 12:49 PM

సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు దృష్టిలో విలన్‌ అయ్యాడు.. కానీ, ఇప్పుడు అతనే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ గెలిపించాడు. ఈ విజయంతో అందరూ హ్యాపీగా ఉన్నా.. హార్ధిక్‌పాండ్యాకు మాత్రం తలనొప్పిగా మారాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు దృష్టిలో విలన్‌ అయ్యాడు.. కానీ, ఇప్పుడు అతనే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ గెలిపించాడు. ఈ విజయంతో అందరూ హ్యాపీగా ఉన్నా.. హార్ధిక్‌పాండ్యాకు మాత్రం తలనొప్పిగా మారాడు.

  • Published Dec 04, 2023 | 12:49 PMUpdated Dec 04, 2023 | 12:49 PM
Suryakumar Yadav: హార్ధిక్‌ పాండ్యాకు తలనొప్పిగా మారిన సూర్య! ఏమి జరిగిందంటే?

ప్రస్తుతం టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 పోయిన బాధ నుంచి కోలుకుంటూ.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌ కప​ 2024పై ఫోకస్‌ పెట్టింది. వరల్డ్‌ కప్‌ తర్వాత.. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. యువ క్రికెటర్లందరూ ఈ సిరీస్‌లో ఎంతో అద్భుతంగా రాణించారు. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం అద్భుతంగా ఆడటంతో పాటు.. కెప్టెన్‌గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు.

ఆసీస్‌ సిరీస్‌ విజయంతో ఇప్పుడంతా సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ స్కిల్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. బౌలింగ్‌ మార్పులు కానీ, ఫీల్డింగ్‌ సెట్టింగ్‌లో గానీ సూర్యకుమార్‌ ఎంతో మెచ్యూర్‌గా వ్యవహరించాడంటూ.. క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నార. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఓ టీమిండియా ఆటగాడికి తలనొప్పిగా మారింది. అతనే హార్థిక్‌ పాండ్యా. వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ముందు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ టైమ్‌లో పాండ్యానే భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇప్పుడు వరల్డ్‌ కప్‌ తర్వాత మళ్లీ రోహిత్‌ శర్మనే టీ20 కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే.. రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటే.. ఆ ప్లేస్‌ హార్ధిక్‌ పాండ్యాదే అని చాలా మంది భావించారు. కానీ, ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ కావడం, ఆటగాళ్లతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. గ్రౌండ్‌లో ఎంతో మంచి వాతావరణం తీసుకొచ్చాడు. బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇచ్చినా.. ఆవేశానికి పోకుండా ఎంతో శాంతంగా వారిని ప్రొత్సహిస్తూ.. మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ఈ విషయంలో పాండ్యా కంటే సూర్యనే బెటర్‌గా ఉన్నాడు. పైగా టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. ఇలా కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేసిన సూర్య.. టీ20 క్రికెట్‌లో కెప్టెన్సీ విషయంలో పాండ్యాకు పోటీగా తయారయ్యాడు. మరి రోహిత్‌ శర్మ కాకుంటే.. టీ20 కెప్టెన్‌గా సూర్య ఉంటే బాగుంటుందా? పాండ్యా ఉంటే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.