Nidhan
ఐపీఎల్-2024లో అందర్నీ భయపెడుతూ వస్తోంది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అలాంటి టీమ్‌ను సీఎస్కే పేసర్ సిమర్జీత్ సింగ్ భయపెట్టాడు.
ఐపీఎల్-2024లో అందర్నీ భయపెడుతూ వస్తోంది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అలాంటి టీమ్‌ను సీఎస్కే పేసర్ సిమర్జీత్ సింగ్ భయపెట్టాడు.
Nidhan
ఐపీఎల్-2024లో అందర్నీ భయపెడుతూ వస్తోంది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అలాంటి టీమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ సిమర్జీత్ సింగ్ భయపెట్టాడు. అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటర్లతో ఆడుకున్నాడు. అతడి దెబ్బకు తల్లడిల్లిన ప్రత్యర్థి జట్టు.. 145 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ బ్యాటింగ్‌లో కీలకమైన ముగ్గురు స్టార్ బ్యాటర్లను సిమర్జీత్ సింగ్ వెనక్కి పంపించాడు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), జాస్ బట్లర్ (21)తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ (15)ను కూడా సిమర్జీత్ పెవిలియన్‌కు పంపించాడు. వికెట్ మీద ఉన్న సీమ్, బౌన్స్‌ను ఉపయోగించుకొని బంతుల్ని గట్టిగా హిట్ చేస్తూ ఫలితం రాబట్టాడు. పర్ఫెక్ట్ లెంగ్త్‌లో బంతులు విసురుతూ రాజస్థాన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లు వేసిన సిమర్జీత్.. 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు తుషార్ దేశ్‌పాండే (2/30) అదరగొట్టడంతో సంజూ సేన 20 ఓవర్లలో 141 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై నెగ్గితే అందులో ఎక్కువ క్రెడిట్ సిమర్జీత్కే దక్కుతుందని చెప్పాలి. మరి.. ఈ సీఎస్కే పేసర్ స్పెల్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
WHAT A SPELL, SIMRAJEET…!!
– In a must win game for CSK, he went for 26 runs from just 4 overs by taking 3 important wickets of Jaiswal, Buttler, Samson. 🌟 pic.twitter.com/5ULhJ4I7UV
— Johns. (@CricCrazyJohns) May 12, 2024
DESHPANDE, YOU BEAUTY – Terrific catch…!!!!! pic.twitter.com/bIdjq8miwU
— Johns. (@CricCrazyJohns) May 12, 2024