iDreamPost

MS Dhoni: IPLకు ధోని గుడ్​బై.. హింట్ ఇచ్చిన CSK ఫ్రాంచైజీ!

  • Published May 12, 2024 | 5:11 PMUpdated May 12, 2024 | 5:11 PM

సీఎస్​కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బిగ్ హింట్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీఎస్​కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడి కోసమే స్టేడియాలకు వచ్చే ఫ్యాన్స్​కు లెక్కే లేదు. అద్భుతమైన బ్యాటింగ్​, సూపర్బ్ కీపింగ్, తిరుగులేని కెప్టెన్సీతో అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించాడు మాహీ. అయితే చాన్నాళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన ధోని.. ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. గత మూడేళ్లుగా లీగ్​ నుంచి అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. గతేడాది గాయం అయింది అయినా ఆడాడు ధోని. ఈసారి ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకపోయినా కంటిన్యూ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి అభిమానులకు పిడుగు లాంటి వార్త.

ధోని రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. రాజస్థాన్ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అభిమానులు స్టేడియంలోనే ఉండాలని కోరింది. వాళ్లకు సర్​ప్రైజ్ ఉందని తెలిపింది. అయితే ఇది ధోని రిటైర్మెంట్ గురించేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ సీజన్​లో ఎల్లో ఆర్మీకి హోమ్ గ్రౌండ్​లో ఇదే ఆఖరి మ్యాచ్. తనను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ నడుమ రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని అనుకుంటున్నాడని.. అందుకే ఈ ప్రకటన వెలువడిందని అంటున్నారు. ఇది స్పెషల్ న్యూస్ కాదు.. బ్యాడ్ న్యూస్ అని, మాహీ ఇక మీదట క్రికెట్ ఫీల్డ్​లో కనిపించడని వర్రీ అవుతున్నారు. అయితే దీనిపై సీఎస్​కే ఫ్రాంచైజీ లేదా ధోని క్లారిటీ ఇచ్చేదాకా ఏదీ చెప్పలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి