Somesekhar
కీలక మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తు చేసేందుకు సీఎస్కే మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో సీఎస్కే మేనేజ్ మెంట్ ఈ భారీ రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాల్లోకిి వెళితే..
కీలక మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తు చేసేందుకు సీఎస్కే మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో సీఎస్కే మేనేజ్ మెంట్ ఈ భారీ రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాల్లోకిి వెళితే..
Somesekhar
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్.. ఇది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కాదు. కానీ ఫైనల్ కంటే ఎక్కువ. ఇక ఈ కీలకపోరు కోసం కొన్ని కోట్ల మంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిన్నస్వామి వేదిగా జరిగే ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు తమ మాస్టర్ ప్లాన్స్ సిద్దం చేసుకున్నాయి. సీఎస్కే సైతం ఆర్సీబీని చిత్తు చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. కీలక మ్యాచ్ కావడంతో.. ఆ రాక్షసుడిని ముందుగానే బరిలోకి దించుతున్నట్లు సమాచారం. మరి ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు? తెలుసుకుందాం పదండి.
CSK vs RCB హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఎవరికి వారు తమ తమ ప్లాన్స్ తో యుద్ధానికి రెడీ అయ్యారు. విరాట్ కోహ్లీని ఆపడానికి చెన్నై ప్రణాళికలు రచిస్తే.. అటు ధోని వ్యూహాలను చిత్తు చేయడానికి ఇటు ఆర్సీబీ పై ఎత్తులు వేస్తోంది. మరి ఈ ఎత్తులు, పై ఎత్తులలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఈ క్రమంలోనే ఆర్సీబీని చిత్తు చేసి ప్లే ఆఫ్స్ చేరేందుకు సీఎస్కే ఓ భారీ వ్యూహం రచించింది. అందులో భాగంగా మహేంద్రసింగ్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాలని కోచ్ ఫ్లెమింగ్ భావిస్తున్నాడట. పైగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై ధోనికి తిరుగులేని రికార్డ్ ఉంది.
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై మహేంద్రుడికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఆడిన 11 మ్యాచ్ ల్లో 82 సగటుతో 413 పరుగులు చేశాడు. దీంతో చెన్నై మేనేజ్ మెంట్ ఈ మ్యాచ్ లో ధోనిని ముందు బ్యాటింగ్ కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాన్ని గనక సీఎస్కే అమలు పరిస్తే.. ఆర్సీబీకి కష్టాలు తప్పవు. సిక్సులు, ఫోర్లతో ఉన్నంత సేపు పెను విధ్వంసం తప్పదు. ఈ ఆలోచనతోనే సీఎస్కే ఉందట. గత మ్యాచ్ ల్లో మోకాలి, నడుమునొప్పి కారణంగా చివర్లో బ్యాటింగ్ కు దిగాడు ధోని. కానీ ఈ మ్యాచ్ డూ ఆర్ డై కావడంతో.. తన బాధను పంటి బిగువన పట్టుకునైనా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలనుకుంటున్నాడు మిస్టర్ కూల్. చెన్నై మేనేజ్ మెంట్ సైతం ఇదే ఆలోచనలో ఉంది. మరి తనకు అచ్చొచ్చిన గ్రౌండ్ లో ధోని బ్యాటింగ్ ఆర్డల్లో ముందుకు వస్తే.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఆర్సీబీని చిత్తు చేసుకుంది సీఎస్కే అనుసరిస్తున్న ఈ వ్యూహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.