iDreamPost
android-app
ios-app

CSKకు ఊహించని ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

  • Published May 03, 2024 | 5:52 PM Updated Updated May 03, 2024 | 5:52 PM

పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ టోర్నీ మధ్యలో నుంచే వైదొలిగాడు.

పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ టోర్నీ మధ్యలో నుంచే వైదొలిగాడు.

  • Published May 03, 2024 | 5:52 PMUpdated May 03, 2024 | 5:52 PM
CSKకు ఊహించని ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

ఐపీఎల్-2024ను పాజిటివ్​గా స్టార్ట్ చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. సీజన్ ఫస్టాఫ్​లో వరుస విజయాలతో దుమ్మురేపింది. దీంతో ఈసారి కూడా ఆ జట్టే కప్పు ఎగరేసుకుపోతుందని అంతా భావించారు. కానీ క్రమంగా ఆ టీమ్​ మూమెంటమ్ దెబ్బతింది. అనూహ్య ఓటములతో రేసులో వెనుకబడింది రుతురాజ్ సేన. ఆడిన 10 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్​లో 5వ పొజిషన్​లో నిలిచింది. ప్లేఆఫ్స్ వెళ్లడం పక్కాగా కనిపిస్తోంది. కానీ మ్యాచ్​ మ్యాచ్​కు ఆ టీమ్​కు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మధ్యలో నుంచే ఓ సీఎస్​కే స్టార్ వెళ్లిపోతున్నాడు.

చెన్నై ఏస్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలో నుంచే వైదొలుగుతున్నాడు. బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాడైన ముస్తాఫిజుర్ స్వదేశంలో జింబాబ్వే సిరీస్ ఉండటంతో వెళ్లిపోతున్నాడు. ఈ సందర్భంగా సీఎస్​కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ప్రత్యేకంగా కలిశాడతను. టీమ్​ను విడిచి వెళ్తున్న ముస్తాఫిజుర్​కు మాహీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తాను సంతకం చేసిన చెన్నై టీమ్ జెర్సీని అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ముస్తాఫిజుర్ టీమ్​ను వీడటంతో ఇప్పుడు రుతురాజ్ సేన కష్టాలు మరింత పెరిగాయి. ఎందుకంటే ఈ సీజన్​లో ఫుల్ స్వింగ్​లో ఉన్న ఈ పేసర్ ఆడిన 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.

ఈ సీజన్​లో చెన్నై సాధించిన విజయాల్లో ముస్తాఫిజుర్​ది చాలా కీలకపాత్ర. అలాంటోడు టోర్నీ మధ్యలోనే ఇలా జట్టును వదిలి వెళ్లిపోవడం అంటే జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటు మరో స్టార్ పేసర్ పతిరానా కూడా వీసా ఇష్యూస్ కారణంగా మళ్లీ శ్రీలంకకు వెళ్లాల్సి ఉందని అంటున్నారు. వీసా కారణంగా అతడు మరికొన్ని మ్యాచ్​లు మిస్సయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరే కాదు సీనియర్ పేసర్ దీపక్ చాహర్​ కూడా గాయం కారణంగా ఆల్రెడీ దూరమయ్యాడు. అతడి ఇంజ్యురీ మీద ఇంకా ఎలాంటి అప్​డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఉన్న లిమిటెడ్ ఆప్షన్స్​తో సీఎస్​కే ఎలా నెగ్గుకొస్తుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. మరి.. ముస్తాఫిజుర్ లేకపోవడం చెన్నై మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.