iDreamPost
android-app
ios-app

వీడియో: ‘పుష్ప’ విలన్​ను దించేసిన ప్యాట్ కమిన్స్.. యాక్టింగ్​లోనూ తగ్గేదేలే!

  • Published May 03, 2024 | 5:13 PMUpdated May 03, 2024 | 5:13 PM

బౌలింగ్, కెప్టెన్సీనే కాదు.. యాక్టింగ్​లోనూ తగ్గేదేలే అంటున్నాడు సన్​రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్. ‘పుష్ప’ విలన్​ను దించేశాడతను.

బౌలింగ్, కెప్టెన్సీనే కాదు.. యాక్టింగ్​లోనూ తగ్గేదేలే అంటున్నాడు సన్​రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్. ‘పుష్ప’ విలన్​ను దించేశాడతను.

  • Published May 03, 2024 | 5:13 PMUpdated May 03, 2024 | 5:13 PM
వీడియో: ‘పుష్ప’ విలన్​ను దించేసిన ప్యాట్ కమిన్స్.. యాక్టింగ్​లోనూ తగ్గేదేలే!

ఈ జట్టు వేస్ట్. ఓటమి తప్ప గెలవడమే మర్చిపోయింది. ఐపీఎల్​లో నుంచి తీసేయండి.. లాస్ట్ సీజన్ వరకు సన్​రైజర్స్ హైదరాబాద్​ మీద వచ్చిన విమర్శలు ఇవి. సొంత అభిమానుల నుంచి కూడా ఆ టీమ్​కు మద్దతు కరువైంది. దానికి ప్రధాన కారణం చెత్తాటే. కప్పు సంగతి పక్కన బెడితే కనీసం ప్లేఆఫ్స్​కు కూడా క్వాలిఫై కాలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ. పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​లో ఉన్న టీమ్స్​తో పోటీపడుతూ ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే ఒక్క సీజన్​తో జట్టు రాతే మారిపోయింది. ఇప్పుడు టాప్ టీమ్స్ కూడా ఎస్​ఆర్​హెచ్​ను చూస్తే గజగజ వణుకుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్. జట్టుకు గెలుపు రుచి చూపించిన కమిన్స్.. ప్రత్యర్థులకు అసలైన భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తున్నాడు.

ఈ సీజన్​లో సన్​రైజర్స్ ఆటతీరే మారిపోయింది. అటాకింగ్ గేమ్​తో అపోజిషన్ టీమ్స్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది హైదరాబాద్. కమిన్స్ అటు బౌలర్​గానూ, ఇటు కెప్టెన్​గానూ ఫుల్ సక్సెస్ అవుతున్నాడు. టీమ్​ను చక్కగా నడిపిస్తూ.. ఆటగాళ్లలోని టాలెంట్​ను అవసరానికి తగ్గట్లు బయటకు తీస్తున్నాడు. అలాంటోడు క్రికెట్టే కాదు.. యాక్టింగ్​లోనూ ఇరగదీస్తానని నిరూపించుకుంటున్నాడు. ఇటీవల మహేష్ బాబు, పవన్ కల్యాణ్​ సినిమాల్లోని ఫేమస్ డైలాగ్​లు చెప్పి తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు. ఇప్పుడు ‘పుష్ప’ విలన్​ను దింపేశాడు కమిన్స్. లేటెస్ట్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు సన్​రైజర్స్ సారథి.

‘పుష్ప’ ఫేమ్ ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ అనే మలయాళ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్​గా నిలిచింది. ఇందులోని ‘కరింకాలియల్లే’ సాంగ్ బాగా వైరల్ అయింది. ఈ పాటలో ఫహద్ ఫాజిల్ ఒకేసారి రెండు విభిన్నమైన ఎక్స్​ప్రెషన్స్​తో ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేశాడు. దీంతో ఈ సాంగ్​ మీద చాలా మంది సెలెబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​ను కాన్సెప్ట్​గా తీసుకొని ఈ సాంగ్​ను కమిన్స్ రీక్రియేట్ చేశాడు. ఎస్​ఆర్​హెచ్ బ్యాటింగ్ టైమ్​లో పవర్​ప్లేలో 2 వికెట్లు పడటం, హెడ్ డిస్మిసల్, నితీష్ కుమార్ రెడ్డి సూపర్బ్ బ్యాటింగ్, భువనేశ్వర్ బౌలింగ్, జైస్వాల్-పరాగ్ హిట్టింగ్ లాంటి మ్యాచ్​లోని కీలక సందర్భాలను ఎక్స్​ప్రెషన్స్​తో అద్భుతంగా పండించాడు కమిన్స్. ఆ సాంగ్​కు తగ్గట్లు అతడి హావభావాలు కూడా పర్ఫెక్ట్​గా సింక్ అవడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. మరి.. కమిన్స్ యాక్టింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి