Nidhan
ఐపీఎల్-2024కు ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి అందర్నీ డిసిషన్ షాక్‌కు గురిచేస్తోంది.
ఐపీఎల్-2024కు ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి అందర్నీ డిసిషన్ షాక్‌కు గురిచేస్తోంది.
Nidhan
ఐపీఎల్-2024 ఆరంభానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. శుక్రవారం నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్‌లో పోటీపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. హోమ్ గ్రౌండ్లో వేలాది మంది అభిమానుల నడుమ ఆర్సీబీని ఓడించి సీజన్‌ను తమదైన స్టైల్లో స్టార్ట్ చేయాలని సీఎస్కే భావిస్తోంది. 16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఐపీఎల్ కప్పును ఎలాగైనా కొట్టాలని కసి మీద ఉన్న ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లో చెన్నైని ఓడిస్తే అదిరిపోతుందని అనుకుంటోంది. ఈ తరుణంలో సీజన్ ఆరంభానికి ఒక్క రోజు ముందు సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్లేసులో ఓ కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చేశాడు మాహీ.
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ధోని.. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పజెప్పాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది. సారథ్య బాధ్యతల్ని రుతురాజ్‌కు ధోని అప్పగించాడని తెలిపింది. అయితే సీఎస్కే అనౌన్స్మెంట్కు ముందే ఈ విషయం బయటకు వచ్చింది. ఐపీఎల్ సీజన్ రేపే స్టార్ట్ కానుండటంతో అన్ని జట్ల కెప్టెన్లతో కలసి గురువారం ఓ ఫొటో షూట్ నిర్వహించారు. ఇందులో అన్ని టీమ్స్ తరఫున ఆయా కెప్టెన్స్ హాజరయ్యారు. అయితే సీఎస్కే తరఫున ధోనీకి బదులు రుతురాజ్ వచ్చాడు. దీంతో చాలా మందికి అక్కడే అనుమానం వచ్చింది. అయితే ఏదైనా కారణం వల్ల మాహీ రాలేక అతడ్ని పంపాడని అంతా అనుకున్నారు. కానీ సీఎస్కే అధికారికంగా ప్రకటించడంతో రుతురాజ్ కొత్త కెప్టెన్ అనేది క్లారిటీ వచ్చేసింది. మరి.. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట చేయండి.
OFFICIAL STATEMENT: MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad. #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024