ధోని లాస్ట్ మ్యాచ్ ఆడేశాడా? ఒక్క స్టేట్మెంట్​తో తేల్చేసిన CSK మేనేజ్మెంట్

ధోని రిటైర్మెంట్ గురించి సీఎస్కే మేనేజ్ మెంట్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ స్టేట్మెంట్ లో ఏముందంటే?

ధోని రిటైర్మెంట్ గురించి సీఎస్కే మేనేజ్ మెంట్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ స్టేట్మెంట్ లో ఏముందంటే?

ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది చెన్నై. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు చెన్నై ఫ్యాన్స్. ఇక ధోని అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీఎస్కే ప్లే ఆఫ్స్ కు చేరితే ధోని బ్యాటింగ్ చూడొచ్చని వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ వారి ఉత్సాహం నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి సీఎస్కే మేనేజ్ మెంట్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత క్రికెట్ క్రికెట్ కు మహేంద్రసింగ్ ధోని వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ధోని స్పందించలేదు. ఇక ఈ విషయంపై తాజాగా స్పందించింది చెన్నై ఫ్రాంచైజీ. ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..”ధోని తన భవిష్యత్ పై మాతో ఏం మాట్లాడలేదు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. బహుశా ఆ నిర్ణయం తీసుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాడనుకుంటా. అయితే ఈ సీజన్ లో ధోని వికెట్ల మధ్య పరిగెత్తడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. దాంతో వచ్చే సీజన్లో ఓన్లీ బ్యాటింగ్ కోసమే ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోనిని బరిలోకి దించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే  అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు”  అంటూ మిస్టర్ కూల్ రిటైర్మెంట్ గురించి చెప్పుకొచ్చింది.

కాగా.. ఈ సీజన్ లో చెన్నై పోరు ఇప్పుడే ముగిసింది. రిటైర్మెంట్ విషయం గురించి ధోనితో మాట్లాడేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు చెన్నై ఫ్రాంచైజీ చెప్పుకొచ్చింది. ఇక ధోని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదని, అతడి డెసిషన్ ను మేము ఎప్పుడూ గౌరవిస్తామని సీఎస్కే మేనేజ్ మెంట్ తెలిపింది. ధోని అనుక్షణం జట్టు కోసం ఆలోచించే వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించింది. ఇక ఈ సీజన్ లో ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ లతో ప్రేక్షకులను అలరించాడు. మరి ధోని రిటైర్మెంట్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments