Nidhan
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం అవడానికి ఒక్క రోజు ముందు సీఎస్కే తమ కెప్టెన్‌ను మార్చేయడం తెలిసిందే. ధోని నుంచి రుతురాజ్ కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించాడు. దీనిపై అతడు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు.
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం అవడానికి ఒక్క రోజు ముందు సీఎస్కే తమ కెప్టెన్‌ను మార్చేయడం తెలిసిందే. ధోని నుంచి రుతురాజ్ కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించాడు. దీనిపై అతడు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
ఐపీఎల్ నయా సీజన్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్‌ను మార్చేయడం తెలిసిందే. సంచలన నిర్ణయం తీసుకున్న లెజెండ్ ఎంఎస్ ధోని సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. నాయకత్వ పగ్గాలను యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. టోర్నీకి ముందు నిర్వాహకులు ఏర్పాటు చేసిన కెప్టెన్స్ ఫొటోషూట్‌తో ఈ విషయం మొదట బయటకు వచ్చింది. ఆ షూట్లో సీఎస్కే తరఫున రుతురాజ్ పాల్గొన్నాడు. అన్ని టీమ్స్‌కు కెప్టెన్స్ రాగా.. చెన్నై తరఫున ధోని రాకపోవడం, అతడి ప్లేసులో రుతు అటెండ్ అవడంతో అక్కడే అనుమానం మొదలైంది. ధోని కెప్టెన్సీ వదులుకున్నాడని వార్తలు రాసాగాయి. ఆ తర్వాత కాసేపటికే సీఎస్కే తమ కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై గైక్వాడ్ రియాక్ట్ అయ్యాడు.
కెప్టెన్సీపై రుతురాజ్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. తాను ఓవర్‌నైట్ సారథిని అయిపోలేదన్నాడు. దీని గురించి ధోని అప్పుడే చెప్పాడని రివీల్ చేశాడు. ‘గతేడాది మాహీ భాయ్ కెప్టెన్సీ గురించి నాకు హింట్ ఇచ్చాడు. సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఇన్‌డైరెక్ట్‌గా సూచించాడు. ఇది నాకు సర్ప్రైజింగ్ న్యూస్ ఏమీ కాదు. ఈసారి నేను సీఎస్కే క్యాంప్‌కు వచ్చినప్పుడు కొన్ని మ్యాచ్ సిచ్యువేషన్స్‌ను క్రియేట్ చేసి అందులో నన్ను ఇన్వాల్వ్ చేశాడు. నన్ను చాలా ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ వచ్చారు. సరిగ్గా ఒక వారం ముందు కెప్టెన్సీ గురించి నిర్ణయం తీసుకున్నానని మాహీ నాకు క్లియర్‌గా చెప్పాడు. చెన్నై జట్టు సారథిగా ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. నా మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలీటీ ఉందని తెలుసు. ఈ సీజన్ కోసం నేను రెడీగా ఉన్నా’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.
సీఎస్కే జట్టు అద్భుతంగా ఉందని.. ఇలాంటి స్క్వాడ్‌ను కెప్టెన్‌గా లీడ్ చేయనుండటం గర్వంగా ఉందన్నాడు రుతురాజ్. జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.. కాబట్టి సారథిగా తన పని చాలా ఈజీ అన్నాడు. టీమ్‌ను ముందుండి నడపడం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోందని తెలిపాడు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా తనకు గైడ్ చేసేందుకు మాహీ భాయ్ టీమ్‌లో ఉన్నాడని రుతురాజ్ పేర్కొన్నాడు. ధోనీతో పాటు ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న రవీంద్ర జడేజా, అజింక్యా రహానె లాంటి వాళ్లు ఉండటం మంచి విషయమని వ్యాఖ్యానించాడు. అందుకే తాను ఎక్కువగా ఆందోళన చెందడం లేదని, ఈ సీజన్లో గేమ్‌ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానని రుతురాజ్ వివరించాడు. మరి.. కెప్టెన్సీ ఓవర్‌నైట్ రాలేదని, ధోని ముందే హింట్ ఇచ్చాడంటూ రుతురాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ruturaj said “Last year, Mahi bhai had hinted about captaincy, that be ready & this shouldn’t be come as a surprise for you – when I came to the camp, he made me involved in some of the match simulation – back of the mind it was there, a week ago, he told I have decide this”. pic.twitter.com/1FlTGroQWX
— Johns. (@CricCrazyJohns) March 22, 2024
“Feels Good! It’s a privilege!” – Captain Rutu 🗣️🦁 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HPyWuEajIg
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024