iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీ పోవడంతో పడిపోయిన ముంబై! అగ్రస్థానంలోకి చెన్నై!

  • Published Dec 18, 2023 | 5:35 PM Updated Updated Dec 18, 2023 | 5:35 PM

ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌లో పెద్ద టీమ్‌, టైటిల్స్‌, పాపులారిటీలో ఎక్కడా తగ్గని జట్టు. కానీ, ఒక్క మార్పుతో ఆ జట్టు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విమర్శలతో పాటు తన ఫస్ట్‌ ప్లేస్‌ను కూడా కోల్పోయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌లో పెద్ద టీమ్‌, టైటిల్స్‌, పాపులారిటీలో ఎక్కడా తగ్గని జట్టు. కానీ, ఒక్క మార్పుతో ఆ జట్టు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విమర్శలతో పాటు తన ఫస్ట్‌ ప్లేస్‌ను కూడా కోల్పోయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 18, 2023 | 5:35 PMUpdated Dec 18, 2023 | 5:35 PM
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీ పోవడంతో పడిపోయిన ముంబై! అగ్రస్థానంలోకి చెన్నై!

మంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి.. అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం క్రికెట్‌ వర్గాల్లో పెను దుమారమే రేపింది. ఆ జట్టుకు ఏకంగా 5 సార్లు ఐపీఎల్‌ టైటిల్స్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. పైగా ఇండియన్‌ నేషనల్‌ టీమ్‌ కెప్టెన్‌, భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఆటగాడు.. ఇవన్నీ పక్కనపెట్టిన ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం.. రోహిత్‌ను తప్పించి.. పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం రోహిత్‌ శర్మ అభిమానులతో పాటు క్రికెట్‌ అభిమానులకు సైతం ఆగ్రహం తెప్పించింది. అసలు టీమ్‌ను వదిలిపెట్టి.. డబ్బు కోసం వేరే టీమ్‌కు మారిన ఆటగాడిని తీసుకొచ్చి.. ముంబైను ఓ ఛాంపియన్‌ టీమ్‌లా మార్చిన వ్యక్తిని ఎలా కెప్టెన్‌గా తప్పిస్తారని క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ జెండాలు, జెర్సీలను కాల్చుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇలా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌కు కూడా తగిలింది. రోహిత్‌ శర్మను కెప్టెన్స్‌ నుంచి తప్పించడంతో ఆ జట్టు నైతికంగానే కాదు.. న్యూమరిక్‌గా కూడా దిగజారిపోయింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌తో ముంబై నంబర్‌ వన్‌ టీమ్‌గా ఉండేది. ఎప్పుడైతే.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. పాండ్యాను కెప్టెన్‌గా చేశాడు. దాదాపు ఒక మిలియన్‌ అంటే పది లక్షల మందికి పైగా క్రికెట్‌ అభిమానులు ముంబై ఇండియన్స్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో కొట్టేశారు. రెండు రోజులుగా వారి కోపాన్ని ఈ రూపంలో చూపిస్తున్నారు. అయితే.. రోహిత్‌ అభిమానుల నుంచి ఈ రేంజ్‌లో రివేంజ్‌ ఉంటుందని బహుషా ముంబై ఇండియన్స్‌ ఊహించి ఉండదు.

ఐపీఎల్‌లో ఎక్కువ క్రేజ్‌ ఉన్న టీమ్స్‌లో ఆర్సీబీ, ముంబై, చెన్నై ముందు వరుసలో ఉంటాయి. అందుకు కారణం.. కోహ్లీ, రోహిత్‌ శర్మ, ధోని. వీళ్ల వల్లే ఆ జట్లుకు అంతా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై ఐదేసి టైటిల్స్‌ గెలిచాయి. కానీ, ఆర్సీబీ ఒక్క సారి కూడా కప్పు కొట్టలేదు. అయినా కూడా ఓవరాల్‌ పాపులరిటీలో ఆర్సీబీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొన్నటి వరకు ముంబై తొలి స్థానంలో, చెన్నై సూపర్‌ కింగ్స్‌, మూడో ప్లేస్‌లో ఆర్సీబీ ఉన్నాయి. కానీ, రోహిత్‌ శర్మ ఎఫెక్ట్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫస్ట్‌ ప్లేస్‌లోకి వచ్చేసింది. ముంబై పరువుపొగొట్టుకుంటూ.. రెండో స్థానానికి దిగజారిపోయింది. ఫ్యాన్స్‌ ఆగ్రహం మరింత కొనసాగితే.. ఆర్సీబీ రెండో స్థానంలోకి వచ్చి.. ముంబై మూడో ప్లేస్‌కు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 13.2 మిలియన్‌ ఫాలోవర్స్‌తో చెన్నై తొలి స్థానంలో ఉంది. ముంబై 12.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో ముంబై రెండో ప్లేస్‌కు పరిమితం అయింది. మరి రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించడం, ఫ్యాన్స్‌ కోపంతో ముంబైని అన్‌ఫాలో చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.