SNP
SNP
టీమిండియా మ్యాచ్ ఆడుతుందంటే.. చాలా మంది క్రికెట్ అభిమానులు కొంతమంది ఆటగాళ్ల ఆటను చూసేందుకు ప్రత్యేకంగా స్టేడియానికి వస్తుంటారు. అలాగే దాదాపు ఫ్యాన్స్ అందరూ ఇష్టపడే ఆటగాళ్ల కూడా ఉంటారు. టీమిండియాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని, కింగ్ కోహ్లీ.. వీళ్లు బ్యాటింగ్‌కి వచ్చే సమయంలో స్టేడియం మొత్తం ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోయేవి. వీళ్లు గ్రౌండ్‌లో ఉన్నంత సేపు.. అభిమానుల హర్షధ్వానాలతో స్టేడియం దద్దరిల్లిపోయేంది. సచిన్.. సచిన్.. అంటూ, అలాగే ధోని.. ధోని.. అంటూ స్టేడియం మార్మోగిపోయేది. సచిన్ రిటైర్ అయిపోయిన తర్వాత.. క్రికెట్ అభిమానులు ఆ మజాను మిస్ అవుతున్నారు.
ఇక ఐపీఎల్‌లో ధోని, కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ 2023లో అయితే ధోని బ్యాటింగ్‌కి వస్తున్న క్రమంలో లైవ్ ఇస్తున్న బ్రాడ్‌కాస్టింక్ కంపెనీలు యాడ్‌లు కూడా ప్లే చేయడం మానేశాయి. ధోని నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ చూసేందుకే అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో దాన్ని కట్ చేయకుండా ప్లే చేస్తున్నాయి. ఆ టైమ్‌లో స్టేడియం ధోని.. ధోని.. అంటూ దద్దరిల్లిపోతుంది. అయితే.. సచిన్, ధోని, కోహ్లీ లాంటి వాళ్లకు అంత క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వాళ్లు దిగ్గజ ఆటగాళ్లు. కానీ, టీమిండియా తరఫున కేవలం రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఓ యవ క్రికెటర్‌కు కూడా సచిన్, ధోని రేంజ్‌లో క్రేజ్ కనిపిస్తే.. నిజంగా షాకింగే కదా.
ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సరిగ్గా అలాంటి సీన్లే కనిపించాయి. టీమిండియా యువ ఆటగాడు, ఐపీఎల్ హీరో, సిక్సర్ల సింగ్.. రింకూ సింగ్ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత.. డబ్లిన్ స్టేడియం మొత్తం రింకూ.. రింకూ.. నామస్మరణతో ఊగిపోయింది. దాదాపు 90 శాతం భారత మద్దతుదారులతో నిండిపోయిన స్టేడియంలో.. రింకూకు ఉన్న క్రేజ్ చూసి తోటి భారత ఆటగాళ్లతో పాటు టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వారు కూడా షాకైపోయారు. ఏంటీ? రింకూకు ఇంత క్రేజ్ ఉందా అని. మరి ఐపీఎల్‌లో మనోడు ఆడిన ఆట మామూలుగా ఉందా. చివరి ఓవర్ చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సులు కొట్ట మ్యాచ్ గెలిపించిన మొనగాడు. అయితే.. ఐర్లాండ్‌తో తొలి టీ20లో రింకూ డెబ్యూ చేసినా.. అతనికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు.
కానీ, రెండో మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి.. చివర్లో టీమిండియా ఇన్నింగ్స్‌కు విలువైన పరుగులు జోడించాడు. రింకూ ఆడిన నాక్ టీమిండియాకు విజయాన్ని అందించిది. అందుకే రింకూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అయితే.. ఈ మ్యాచ్లో రింకూకు లభించన ఆదరణ, అతని క్రేజ్ సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ, అభిమానులు అతని పెట్టుకున్న అంచనాలను రింకూ వంద శాతం అందుకుని మంచి ఎంటటైన్ నాక్ ఆడాడు. సిక్సులతో వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా కోసం స్ట్రాంగ్ ఫినిషర్‌గా ఎదిగేవాడిలా కనిపిస్తున్నాడు. మరి ఐర్లాండ్‌లో రింకూ క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RINKU SINGH IS HERE….!!!
What an outstanding innings by Rinku in debut innings – he’s made it and showed everyone what he’s capable of, what a talent, the future! pic.twitter.com/Cv51juVXwc
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2023
Rinku Singh with his maiden Player Of The Match award in international cricket!
Results of pure hard work and determination – the future is bright. pic.twitter.com/MYUSryqFg6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2023
Dublin crowd chanting ‘Rinku, Rinku’.
Rinku Singh has arrived at the international level…#RinkuSingh #INDvsIRE pic.twitter.com/CQS7FpIIL0
— 𝐒𝐭𝐞𝐯𝐞𝐧 (@SRKsSteven) August 20, 2023
ఇదీ చదవండి: రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. భారత్ విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే!