Raj Mohan Reddy
Cristiano Ronaldo Youtube Channel: యూట్యూబ్ లో ఇప్పుడు ఓ ఛానల్ హైలైట్ గా మారింది. పెట్టిన 24 గంటల్లోనే దానికి ఏకంగా 17 ప్లస్ మిలియన్ సబ్ స్క్రైబర్లు వచ్చారు. దీంతో అసలు ఏంటా ఛానల్? అని అందరూ ఆరాతీసే పనిలో పడ్డారు.
Cristiano Ronaldo Youtube Channel: యూట్యూబ్ లో ఇప్పుడు ఓ ఛానల్ హైలైట్ గా మారింది. పెట్టిన 24 గంటల్లోనే దానికి ఏకంగా 17 ప్లస్ మిలియన్ సబ్ స్క్రైబర్లు వచ్చారు. దీంతో అసలు ఏంటా ఛానల్? అని అందరూ ఆరాతీసే పనిలో పడ్డారు.
Raj Mohan Reddy
సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సంపాదించేందుకు అవకాశం ఉండటంతో చాలా మంది ఆ బాట పడుతున్నారు. యూట్యూబ్ లాంటి ప్లాట్ ఫామ్స్ ను అందుకు వినియోగించుకుంటున్నారు. యూట్యూబ్ లో ఛానల్ పెట్టేవారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఆ ఛానల్స్ లో వీడియోలు పెడుతూ వ్యూస్ తో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వ్యూస్ రాకపోవడం, సబ్ స్క్రైబర్లు పెరగకపోవడంతో చతికిలపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేక.. ఆఖరికి ఛానల్స్ ను క్లోజ్ చేసుకుంటున్నారు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ మాత్రం పెట్టిన 24 గంటల్లోనే ఏకంగా 17 ప్లస్ మిలియన్ సబ్ స్క్రైబర్లను రాబట్టింది. దీంతో ఏంటా ఛానల్ అంటూ ఆరాతీసే పనిలో పడ్డారు నెటిజన్స్.
ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండే రొనాల్డో తాజాగా యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టేసరికి అభిమానులు దాని గురించి తెలుసుకొని సబ్ స్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు. చూస్తుండగానే 24 గంటల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్లు ఏకంగా 17 మిలియన్లు దాటేయడం విశేషం. ఈ సందర్భంగా రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్స్ తో స్ట్రాంగ్ రిలేషన్ షిప్ కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉందన్నాడు. తనతో పాటు తన ఫ్యామిలీ గురించి అభిమానులు మరింతగా తెలుసుకునేందుకు ఈ ఛానల్ ఉపయోగపడుతుందన్నాడు. పలు విషయాలపై తన అభిప్రాయాలను ఈ ఛానల్ ద్వారా పంచుకోనున్నట్లు వెల్లడించాడు.
లైఫ్ లో తాను పడ్డ కష్టాలు, ఈ స్థాయికి చేరుకునే వరకు సాగిన ప్రయాణం, ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని దాటిన తీరు అన్నింటినీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తానని రొనాల్డో పేర్కొన్నాడు. తన సబ్ స్క్రైబర్లకు అతడు థ్యాంక్స్ చెప్పాడు. ఇక, యువర్ క్రిస్టియానో పేరుతో ఉన్న ఈ ఛానల్ అత్యంత వేగంగా 1 మిలియన్, అలాగే 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను పొందిన ఛానల్ గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క రోజు వ్యవధిలోనే గోల్డెన్ యూట్యూబ్ ప్లే బటన్ ను దక్కించుకుంది. ఈ ఛానల్ లో ఇప్పటివరకు పన్నెండు వీడియోలు పోస్ట్ చేశాడు రొనాల్డో. దాదాపుగా ప్రతి వీడియోకు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదే స్పీడ్ కొనసాగితే యూట్యూబ్ లో మరిన్ని రికార్డులను రొనాల్డో బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, యూట్యూబ్ ను షేక్ చేస్తున్న రొనాల్డోకు ట్విట్టర్ లో 112.5 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 636 మిలియన్లు, ఫేస్ బుక్ లో 170 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
A present for my family ❤️ Thank you to all the SIUUUbscribers! ➡️ https://t.co/d6RaDnAgEW pic.twitter.com/keWtHU64d7
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024