iDreamPost
android-app
ios-app

మెగా క్రికెట్ టోర్నీలోకి 3 కొత్త రూల్స్! ఇకపై మరింత మజా..

బిగ్ బాష్ లీగ్ 13వ సీజన్ డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కాగా జనవరి 24 వరకు కొనసాగుతుంది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ లీగ్ లో మూడు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్ బాష్ లీగ్ 13వ సీజన్ డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కాగా జనవరి 24 వరకు కొనసాగుతుంది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ లీగ్ లో మూడు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెగా క్రికెట్ టోర్నీలోకి 3 కొత్త రూల్స్! ఇకపై మరింత మజా..

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్నటువంటి ఆదరణ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. మ్యాచ్ జరుగుతుందంటే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోయే ఫ్యాన్స్ కు కొదవ లేదు. ఫార్మాట్ ఏదైనా క్రికెట్ ఆటపై అంతటి అభిమానాన్ని చూపిస్తారు క్రికెట్ అభిమానులు. అయితే క్రికెట్ ఆటకు మరింత జోష్ ను అందిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నమెంట్లకు తెరలేపారు. ఐపీఎల్ కు ఇండియాలో ఎంతటి ప్రాధాన్యత ఉందో వేరే చెప్పక్కర్లేదు. అదే విధంగా ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్ బాష్ లీగ్ కు కూడా అంతే స్థాయిలో ఆదరణ ఉంది. తాజాగా బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నీలో మూడు కొత్త రూల్స్ ను ప్రవేశ పెట్టారు. దీంతో ఈ టోర్నమెంట్ మరింత రసవత్తరంగా మారనుంది. ఆ రూల్స్ ఏవంటే?

బిగ్ బాష్ లీగ్ అనేది ఆస్ట్రేలియన్ పురుషుల ప్రొఫెషనల్ క్లబ్ టీ20 క్రికెట్ లీగ్. దీనిని క్రికెట్ ఆస్ట్రేలియా 2011లో స్థాపించింది. ఈ ఏడాదికి సంబంధించి బిగ్ బాష్ లీగ్ 13వ సీజన్ డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కాగా జనవరి 24 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ లో బిగ్ బాష్ లీగ్ లో మొత్తం 8 జట్ల మధ్య 44 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం 16వ లీగ్ మ్యాచ్ బ్రిస్ బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య జరుగుతోంది. అయితే ఈ లీగ్ లో తీసుకొచ్చిన మూడు నియమాలు ఆటపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.

ఆ నియమాలు ఇవే

  • ఆస్ట్రేలియాలో మార్వెల్ స్టేడియం ఉంది. అయితే దీని పైకప్పు మాత్రం సగం గ్రౌండ్ లోకి నిర్మించబడి ఉంది. ఈ కారణంగా బ్యాట్స్ మెన్ షాట్ కొట్టినప్పుడు ఆ పైకప్పుకు తాకడం వల్ల అది బౌండరీ లైన్ దాటడం లేదు. దీనిపై విమర్శలు తలెత్తిన కారణంగా ఆ సమస్యకు పరిష్కారం చూపింది. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త నిబంధన ప్రకారం, మార్వెల్ స్టేడియం పైకప్పుపై బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టినట్లయితే, ఆ షాట్ సిక్సర్‌కు పోయిందని అంపైర్ భావిస్తే, అంపైర్లు అతనికి సిక్స్ ఇస్తారు. వెళ్లలేదని భావిస్తే, ఆ బంతిని డెడ్ బాల్ గా ఇవ్వబడుతుంది.

 

  • బిగ్ బాష్ లీగ్ లో చేర్చిన మరొక నియమం ఏంటంటే.. ఫీల్డింగ్ జట్టు బ్యాట్స్‌మన్ స్టంప్ అవుట్ కోసం అప్పీల్ చేస్తే, థర్డ్ అంపైర్ స్టంప్ అవుట్ మాత్రమే చెక్ చేస్తాడు. ఒకవేళ అదే బంతికి స్టంప్‌ల ద్వారా కాకుండా మరేదైనా అవుట్‌పై అప్పీల్ చేయాల్సి వస్తే లేదా సమీక్షించాల్సి వస్తే, అప్పుడు ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ తన డీఆర్ఎస్ ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా బౌలర్ లేదా ఫీల్డింగ్ జట్టు స్టంప్ అవుట్ కోసం అప్పీల్ చేసినపుడు సైడ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కి సూచిస్తారు. స్టంప్ అవుట్‌తో పాటు, థర్డ్ అంపైర్ ఎల్‌బీడబ్ల్యూ లాగా అవుట్ అయ్యే ఇతర అవకాశాలను కూడా తనిఖీ చేసేవారు. దీంతో ఫీల్డింగ్ టీమ్ డీఆర్‌ఎస్‌ను కాపాడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ కొత్త నిబంధన ద్వారా ఫీల్డింగ్ కెప్టెన్‌లకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడ్డట్లైంది.

 

  • మూడో నియమం ఏంటంటే.. థర్డ్ అంపైర్ ప్రతి మ్యాచ్‌లో ప్రతి బంతికి నో బాల్‌ని చెక్ చేస్తాడు. ఒక బౌలర్ నో బాల్ వేస్తే, అది వెంటనే ఫీల్డ్ అంపైర్‌కి నివేదిస్తాడు. ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్ ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటిస్తాడు.
    మరి బిగ్ బాష్ లీగ్ లో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన మూడు నియమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.