iDreamPost
android-app
ios-app

ఏం తింటావ్ బ్రో.. సిక్సర్ దెబ్బకు కిటికీ బద్దలైంది! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 04:22 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 04:22 PM, Thu - 14 September 23
ఏం తింటావ్ బ్రో.. సిక్సర్ దెబ్బకు కిటికీ బద్దలైంది! వీడియో వైరల్..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో సిక్స్ లు కొడితే.. గ్రౌండ్ బయటో, లేదా కార్ల పార్కింగ్ లోనో వెళ్లి పడతాయి. ఇలాంటి సిక్స్ లు మనం ఎన్నో చూశాం. ఇక టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి సిక్స్ లకు కొదవలేదు. అయితే తాజాగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఓ వెరైటీ సిక్స్ నమోదు అయ్యింది. ఈ సిక్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గయానా అమెజాన్ వారియర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన సిక్స్ తో మెరిశాడు ఫాబియన్ అలెన్. అతడు కొట్టిన సిక్స్ కు స్టేడియంలో గత ఓ కిటికీ అద్దం బద్దలైంది. దీంతో ఏం తింటావ్ బ్రో నువ్వు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా.. బుధవారం జమైకా తల్లావాస్ వర్సెస్ గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు భారీ సిక్సర్లు నమోదు అయ్యాయి. అందులో ఓ సిక్సర్ మాత్రం సిక్స్ లందు ఈ సిక్స్ వేరయా అన్న రేంజ్ లో ఉండటం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన వారియర్స్.. బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన జమైకా తల్లావాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ బ్రెండన్ కింగ్(52) అర్ధశతకంతో మెరవగా.. ఫాబియన్ అలెన్ 21 పరుగులతో రాణించాడు. అలెన్ చేసిన ఈ 21 పరుగులలో రెండు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అందులో ఒకటి ప్రిటోరియస్ బౌలింగ్ లో కొట్టాడు. ఈ సిక్స్ కు మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. అలెన్ కొట్టిన ఈ భారీ సిక్స్ కు స్టేడియంలోని కిటికీ అద్దం బద్దలైపోయింది. దీంతో గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు అవాక్కైయ్యారు.

ఇక తాహిర్ వేసిన మరో ఓవర్లో 103 మీటర్ల భారీ సిక్స్ ను బాదాడు అలెన్. ప్రస్తుతం ఈ రెండు సిక్స్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ సిక్స్ లు చూసిన ఫ్యాన్స్ ఏం తింటావ్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జమైకా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టు 18.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. జట్టులో ఓపెనర్ సయీమ్ అయూబ్ 53 బంతుల్లోనే 85 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ మాథ్యూ నందు 37 పరుగులతో రాణించాడు. మరి కిటికీలు పగిలే రేంజ్ లో భారీ సిక్స్ కొట్టిన అలెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.