SNP
Dinesh Karthik, Avesh Khan, RCB vs RR: రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ డీకే విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
Dinesh Karthik, Avesh Khan, RCB vs RR: రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ డీకే విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఛాలెంజర్స్ టీమ్.. అంచనాలను అందుకోలేకపోయింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్రస్థానం ఈ సీజన్‌లో ముగిసింది. ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే ఆర్సీబీ లక్ష్యం మరో ఏడాదికి పెండింగ్ పడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో, క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది. ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై వివాదం రాజుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. పడుతూ లేస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. రాజస్థాన్ బౌలర్ ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో దినేష్ కార్తీక్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బాల్ ప్యాడ్‌ను తాకింది. బౌలర్ అపీల్ చేయడంతో.. ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. డీకే రివ్యూ కోరాడు. బాల్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్.. డీకేను నాటౌట్‌గా ప్రకటించాడు. బాల్.. ప్యాట్‌కు తాకే ముందు బ్యాట్‌కు తాకిందని భావించిన థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, రీప్లేలో కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ప్యాడ్‌కు బాల్ తాకే ముందు.. ఒక చిన్న స్పైక్ వచ్చింది. కానీ, అది బ్యాట్‌కు బాల్ తాకడం వల్ల కాదు.. ప్యాడ్‌కు బ్యాట్ తాకడం వల్ల వచ్చింది.
అది గమనించకుండా.. బాల్ బ్యాట్‌కు తాకిందనుకున్న థర్డ్ అంపైర్ డీకేను నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని కామెంటేటర్లు సైతం తప్పబట్టారు. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సరైన నిర్ణయాన్ని టెక్నాలజీ వాడి కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చారంటూ.. కామెంటేటర్‌గా చేస్తున్న టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార్ సంగాక్కర కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లతో కూడా ఆయన మాట్లాడాడు. అయితే.. అంపైర్ తప్పుడు నిర్ణయంతో అవుట్ నుంచి బతికిపోయిన డీకే.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. 13 బంతుల్లో 11 పరుగులు చేసి.. కొద్ది సేపటికే అవుట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఆర్‌ఆర్‌కు పెద్ద నష్టం చేయలేదు. మరి అవుటైన డీకేను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dinesh Karthik has survived. Make it big man. pic.twitter.com/E6MssgztS8
— R A T N I S H (@LoyalSachinFan) May 22, 2024