iDreamPost
android-app
ios-app

వీడియో: గ్రౌండ్‌లో కుప్పకూలిన నాన్‌స్ట్రైకర్‌! బౌలర్‌ చేసిన పనికి ఫిదా

  • Published Jun 03, 2024 | 9:08 AM Updated Updated Jun 03, 2024 | 9:08 AM

Chris Wood, the Vitality t20 Blast, Hampshire vs Kent: బ్యాటర్‌ కొట్టిన షాట్‌కు నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్‌ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో బౌలర్‌ చేసిన పనికి అంతా ఫిదా అయిపోయారు. అదేంటో ఇప్పుడ క్లియర్‌గా తెలుసుకుందాం..

Chris Wood, the Vitality t20 Blast, Hampshire vs Kent: బ్యాటర్‌ కొట్టిన షాట్‌కు నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్‌ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో బౌలర్‌ చేసిన పనికి అంతా ఫిదా అయిపోయారు. అదేంటో ఇప్పుడ క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Jun 03, 2024 | 9:08 AMUpdated Jun 03, 2024 | 9:08 AM
వీడియో: గ్రౌండ్‌లో కుప్పకూలిన నాన్‌స్ట్రైకర్‌! బౌలర్‌ చేసిన పనికి ఫిదా

క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌ గేమ్‌ అంటారు.. ‘స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌’, ‘క్రీడా స్ఫూర్తి’ అనే పదాలు క్రికెట్‌లో తరచు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా క్రీడాస్ఫూర్తిని చాటాడు ఓ బౌలర్‌. తను చేసిన పనికి క్రికెట్‌ లోకం మొత్తం ఫిదా అయిపోయింది. బ్యాటర్‌ కొట్టిన భారీ షాట్‌కు బాల్‌ వచ్చి నాన్‌స్ట్రైకర్‌కు చాలా బలంగా తాకింది. దాంతో.. నాన్‌స్ట్రైకర్‌ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. రన్‌కోసం అప్పటికే క్రీజ్‌ను వదిలిపెట్టేసిన అతను క్రీజ్‌ మధ్యలోకి వెళ్లిన తర్వాత కిందపడిపోయాడు. కానీ, బౌలర్‌ అతన్ని రనౌట్‌ చేయడకుండా క్రీడాస్ఫూర్తిని చాటాడు. మరి ఈ ఘటన ఏ మ్యాచ్‌లో జరిగింది. మనసులు గెలిచిన ఆ బౌలర్‌ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌ దేశవాళి క్రికెట్‌లో భాగంగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆదివారం హాంప్‌షైర్‌, కెంట్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెంట్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించింది. అయితే.. కెంట్‌ ఇన్నింగ్స్‌ చివర్లో ఓ ఊహించని ఘటన జరిగింది. హాంప్‌షైర్‌ బౌలర్‌ క్రిస్‌ వుడ్‌ వేసిన ఫుల్‌ లెంత్‌ డెలవరీని కెంట్‌ బ్యాటర్‌ ఓయి ఎవిసన్‌ స్ట్రైయిట్‌గా బలమైన షాట్‌ ఆడాడు. అది నేరుగా వచ్చి.. నాన్‌స్ట్రైకర్‌లో ఉండి.. రన్‌ కోసం వస్తున్న మాథ్యూ పార్కిన్సన్‌కు బలంగా తాకింది. దీంతో.. క్రీజ్‌ మధ్యలోనే మాథ్యూ కుప్పకూలిపోయాడు.

అతనికి తగిలిన బంతి.. అక్కడే బౌలర్‌ చేతికి దొరికింది. కానీ, వుడ్‌ మాత్రం రనౌట్‌ చేయకుండా.. నెక్ట్స్‌ బాల్‌ వేసేందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ పార్కిన్సన్‌ను సులువుగా రనౌట్‌ చేసే అవకాశం వుడ్‌కు ఉంది. కానీ, అతనికి దెబ్బ తగిలి పడిపోయి ఉండటంతో.. వుడ్‌ రనౌట్‌ చేయకుండా క్రీడా స్ఫూర్తి చాటాడు. దీంతో.. వుడ్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కెంట్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రిస్‌ వుడ్‌ 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 166 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించి హాంప్‌షైర్‌. మరి ఈ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి చాటిన క్రిస్‌ వుడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.