iDreamPost
android-app
ios-app

IND vs ENG: రెండో టెస్ట్‌ కోసం టీమ్‌లో మార్పులు.. ఇంగ్లండ్‌కు సరైనోడిని దింపుతున్నారు!

  • Published Jan 29, 2024 | 11:43 AM Updated Updated Jan 30, 2024 | 1:14 PM

Cheteshwar Pujara, IND vs ENG: తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలుకావడంతో రెండో టెస్ట్‌పై ఇప్పటి నుంచే ఫోకస్‌ మొదలైండి. తొలి టెస్ట్‌ ఓటమి నుంచి ఎదురైన పాఠాల నుంచి రెండో టెస్ట్‌ గెలవాలనే కసితో మార్పులు జరగనున్నాయి. దీంతో ఇంగ్లండ్‌కు సరైనోడిని దింపే ఆలోచనలో ఉంది టీమ్‌ మెనేజ్‌మెంట్‌. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

Cheteshwar Pujara, IND vs ENG: తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలుకావడంతో రెండో టెస్ట్‌పై ఇప్పటి నుంచే ఫోకస్‌ మొదలైండి. తొలి టెస్ట్‌ ఓటమి నుంచి ఎదురైన పాఠాల నుంచి రెండో టెస్ట్‌ గెలవాలనే కసితో మార్పులు జరగనున్నాయి. దీంతో ఇంగ్లండ్‌కు సరైనోడిని దింపే ఆలోచనలో ఉంది టీమ్‌ మెనేజ్‌మెంట్‌. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 29, 2024 | 11:43 AMUpdated Jan 30, 2024 | 1:14 PM
IND vs ENG: రెండో టెస్ట్‌ కోసం టీమ్‌లో మార్పులు.. ఇంగ్లండ్‌కు సరైనోడిని దింపుతున్నారు!

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మూడో రోజు వరకు టీమిండియాదే పైచేయిగా ఉన్నా.. ఓలీ పోప్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ​ండ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కాగా, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో క్రికెట్‌ అభిమానులు జట్టుపై సీరియస్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్వదేశంలో అందులోనా మంచి పొజిషన్‌లో ఉన్న తర్వాత కూడా టీమిండియా ఓడిపోవడం క్రికెట్‌ అభిమానులను తీవ్ర‍ంగా నిరాశపర్చింది. టీమ్‌లో చాలా మైనస్‌లు ఉన్నాయని వాటిని సరిదిద్దుకుంటే తప్పా.. తర్వాతి మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.

అయితే.. రెండో టెస్ట్‌ కోసం టీమ్‌లో మార్పులు చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా.. జట్టులో గట్టి మార్పులు చేసి.. రెండో టెస్టులో పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఈ విషయంపై క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, టీమ్‌ మొత్తం యువ రక్తంతో నింపేశారు. కానీ, టెస్ట్‌ క్రికెట్‌ అంటే లెక్క వేరే ఉంటుందని, పూర్తిగా యువ క్రికెటర్లతో వెళ్తే ఎదురుదెబ్బ తగులుతుందని తాజాగా తొలి మ్యాచ్‌తోనే వాళ్లకు అర్థమై ఉంటుంది. అందుకే రెండో టెస్ట్‌ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అదేంటంటే.. ఇప్పటికే సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ టీమ్‌లో లేకపోవడంతో జట్టులో అనుభవం కొరవడింది. దాంతో పాటు టెస్టు క్రికెట్‌ను సరిగా అర్థం చేసుకునే క్రికెటర్‌ కావాలి.  అందుకే దేశవాళి క్రికెట్‌లో అదరగొడుతూ.. రంజీల్లో సత్తా చాటుతున్న యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడో స్థానంలో దారుణంగా విఫలం అవుతున్న శుబ్‌మన్‌ గిల్‌కు రెస్ట్‌ ఇచ్చి.. అతని స్థానంలో సర్ఫరాజ్‌ను ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సర్ఫరాజ్‌కు సైతం ఈ విషయంపై సమాచారం ఇచ్చినట్లు క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి వస్తున్న వార్తల ప్రకారం సర్ఫరాజ్‌ టీమ్‌లోకి వస్తే.. రెండో టెస్ట్‌లో జట్టు బెటర్‌ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.