VIDEO: కోహ్లీ సెంచరీపై పుజారా నెగిటివ్‌ కామెంట్స్‌! ఇలా అనేశాడేంటి?

  • Author Soma Sekhar Updated - 02:25 PM, Sat - 21 October 23

బంగ్లాదేశ్ పై శతకంతో చెలరేగాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా పండితులు, దిగ్గజాలు, క్రికెట్ అభిమానులు విరాట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మాత్రం కోహ్లీ సెంచరీపై నెగిటివ్ కామెంట్స్ చేసి.. అందరిని షాక్ కు గురిచేశాడు.

బంగ్లాదేశ్ పై శతకంతో చెలరేగాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా పండితులు, దిగ్గజాలు, క్రికెట్ అభిమానులు విరాట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మాత్రం కోహ్లీ సెంచరీపై నెగిటివ్ కామెంట్స్ చేసి.. అందరిని షాక్ కు గురిచేశాడు.

  • Author Soma Sekhar Updated - 02:25 PM, Sat - 21 October 23

విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ జపిస్తున్న పేరు. దానికి కారణం మీకు తెలియనిది కాదు. ఇక తన అద్భుతమైన ఆటతీరుతో బంగ్లాదేశ్ పై శతకంతో చెలరేగాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. మరోసారి తాను ఛేజింగ్ లో కింగ్ అని నిరూపించుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా పండితులు, దిగ్గజాలు, క్రికెట్ అభిమానులు విరాట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మాత్రం కోహ్లీ సెంచరీపై నెగిటివ్ కామెంట్స్ చేసి.. అందరినీ షాక్ కు గురి చేశాడు. అయితే పుజారా చేసిన కామెంట్స్ లో నిజం ఉందంటున్నారు కొందరు క్రికెట్ అభిమానులు. మరి నయావాల్ చేసిన ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా రన్ మెషిన్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కింగ్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ లో అతడు సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. చివరికి కోహ్లీ కూడా తాను శతకం సాధిస్తానని అనుకోలేదు. సింగిల్స్ తీద్దామని రాహుల్ కు చెప్పాడు . కానీ రాహుల్ అలా వద్దని చెప్పడంతో సెంచరీ పూర్తి చేశాడు విరాట్ భాయ్. ఇక ఈ శతకంతో వన్డేల్లో 48 సెంచరీలు పూర్తి చేసి.. దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డుకు అతి చేరువగా వచ్చాడు. దీంతో విరాట్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎంతో మంది కోహ్లిని పొగుడుతుంటే.. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మాత్రం కోహ్లీ సెంచరీపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ ఛానల్లో విరాట్ సెంచరీపై మీ సమాధానం ఏంటి? అని పుజారాని అడగ్గా..”విరాట్ సెంచరీ చేయడం సంతోషమే. కానీ.. అతను మ్యాచ్ ను ఇంకాస్త త్వరగా ముగించాల్సింది. అతడు సెంచరీ కోసం మ్యాచ్ ను లేట్ గా ముగించాడు. కోహ్లీ త్వరగా మ్యాచ్ ను ముగిస్తే.. టీమ్ రన్ రేట్ మెరుగుపడేది. ఇది టోర్నీలో జట్టుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే.. ఏ టైమ్ ఎలాంటిదో తెలీదు కదా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పుజారా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పుజారా అన్న దాంట్లో నిజం లేకపోలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. విరాట్ సెంచరీ కోసం చూసుకునే వ్యక్తిత్వం ఉన్న ఆటగాడు కాదు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో నెట్ రన్ రేట్ కీలక సమయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే పుజారా ఈ కామెంట్స్ చేశాడని తెలుస్తోంది. మరి విరాట్ సెంచరీపై పుజారా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments