iDreamPost
android-app
ios-app

Rohit Sharma: మా ఓటమికి అదే కారణం.. కానీ వారిద్దరు మాత్రం..!: రోహిత్ శర్మ

  • Published Jan 29, 2024 | 7:41 AM Updated Updated Jan 29, 2024 | 3:50 PM

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఇక ఈ ఓటమికి కారణాలు వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అదే మా కొంపముంచిందని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఇక ఈ ఓటమికి కారణాలు వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అదే మా కొంపముంచిందని పేర్కొన్నాడు.

Rohit Sharma: మా ఓటమికి అదే కారణం.. కానీ వారిద్దరు మాత్రం..!: రోహిత్ శర్మ

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన భారత టీమ్.. 28 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును 202 రన్స్ కే ఆలౌట్ చేశారు ఇంగ్లాండ్ బౌలర్లు. ఆ జట్టు అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లతో చెలరేగాడు. కాగా.. ఈ ఓటమికి కారణం ఏంటో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా.. అదే జోరును సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనూ చూపించాలని భావించింది. కానీ ఊహించని విధంగా తొలి మ్యాచ్ లోనే భారత్ కు షాకిచ్చింది ఇంగ్లాండ్. 28 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి.. సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక విధంగా పూర్తిగా విఫలం అయ్యిందనే చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో విఫలమైంది. ఇక ఈ ఓటమికి కారణం చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ..

That is the reason for our defeat

“మా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. మేం భయం లేకుండా బ్యాటింగ్ చేయలేకపోయాం. దీంతో పాటుగా రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో మాకు 190 పరుగుల ఆధిక్యం రావడంతో.. విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. కానీ ఓలీ పోప్ అద్భుతంగా ఆడి.. ఇంగ్లాండ్ కు మంచి ఆధిక్యాన్ని సాధించిపెట్టాడు. ఇది మ్యాచ్ ను మా నుంచి చేజారేలా చేసింది. అయితే లోయర్ ఆర్డర్ లో బ్యాటర్లు తమ శక్తికి మేర రాణించారు. వారు రన్స్ ఎలా చేయాలో టాపార్డర్ కు తెలిపేలా చేశారు. భరత్, అశ్విన్, సిరాజ్, బుమ్రాలు పోరాడినప్పటికీ.. ఓటమి తప్పలేదు” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. సిరాజ్, బుమ్రాలు ఆటను ఐదో రోజు వరకు కొనసాగిస్తారని అనుకున్నామని రోహిత్ తెలిపాడు. కానీ మేము మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్. టామ్ హార్ట్లీ, ఓలీ పోప్ మ్యాచ్ ను టీమిండియా నుంచి లాగేసుకున్నారని, వారు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు హిట్ మ్యాన్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో246, రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436, రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయ్యి 28 రన్స్ తేడాతో ఓడిపోయింది. మరి టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.