Somesekhar
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి స్వయంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణం అయ్యాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి స్వయంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణం అయ్యాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మేం బౌలింగ్ లో చేసిన ప్రయోగాలే అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. యువ బౌలర్లను పరీక్షించే క్రమంలోనే ఈ పరాజయం చవిచూడాల్సి వచ్చిందని తెలిపాడు. కానీ ముంబై ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యానే. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ధేశించిన 278 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై.. అదే రేంజ్ లో దంచికొట్టడం ప్రారంభించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశారు. టాప్ 3 బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(34), నమన్ ధీర్(30) పరుగులు చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? వీరి ముగ్గురి స్ట్రైక్ రేట్ 200కు పైగా ఉండటం. తిలక్ వర్మ సైతం 188 స్ట్రైక్ రేట్ తో 64 పరుగులు చేశాడు. దీంతో రన్ రేట్ అదుపులోనే ఉంది. హార్దిక్ పాండ్యా క్రీజ్ లోకి వచ్చేసరికి ముంబై 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి.. లక్ష్యం వైపు దూసుకెళ్తోంది.
పాండ్యా రాకతో స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతుందని అందరూ ఊహించారు. కానీ.. అనూహ్యంగా హార్దిక్ ఆడిన జిడ్డు బ్యాటింగ్ కారణంగా ముంబై చేజేతులా ఓడినట్లు అయ్యింది. హార్దిక్ 20 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్, ఓ సిక్స్ తో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతడి స్ట్రైక్ రేట్ 120. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? కొత్త కుర్రాడు నమన్ ధీర్ 214 స్ట్రైక్ రేట్ తో 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. కనీసం అతడిలా కూడా ఆడలేకపోయాడు. పాండ్యా బాల్స్ ఎక్కువ తీసుకోవడంతో.. సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో స్వయంగా కెప్టెన్ పాండ్యానే ముంబై ఓటమికి కారణం అయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆతర్వాత టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. చివర్లో రోమారియో షెఫర్డ్ సైతం 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ తో 15 పరుగులు చేసినా.. అప్పటికే ముంబై ఓటమి ఖాయమైంది. మరి 20 బంతుల్లో 24 రన్స్ చేసి టీమ్ ఓటమికి కారణమైన పాండ్యాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hardik Pandya dismissed for 24 in 20 balls. pic.twitter.com/nOgCYiJxbH
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2024
ఇదికూడా చదవండి: SRH సంచలన విజయం.. తిట్టిపోస్తున్న RCB ఫ్యాన్స్!